English   

శృతిహాస‌న్ ను వాళ్లు తొక్కేయాల‌నుకున్నారా..?

Shruthi Hassan Latest Update
2017-05-02 07:02:03

శృతిహాస‌న్.. టాలీవుడ్ టూ బాలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా త‌గ్గ‌దు ఈ బ్యూటీ. తండ్రి పేరు వాడుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పిన డేరింగ్ లేడీ శృతిహాస‌న్. మొద‌ట్లో ఐరెన్ లెగ్ గా ముద్ర ప‌డినా.. సొంతంగానే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ మ‌ధ్య మ‌ళ్లీ వ‌ర‌స‌గా ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయింది శృతిహాస‌న్. పైగా కాట‌మ‌రాయుడులో ఈ భామ లుక్స్ పై కూడా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో ఫిజిక్ పై దృష్టి పెట్టింది శృతిహాస‌న్. ఈ సంద‌ర్భంగానే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న పాత రిలేష‌న్ షిప్స్ పై ఓపెన్ అయింది శృతిహాస‌న్.

కొన్నాళ్లు ఈమె ఎవ‌రితోనో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏకంగా శృతికి పెళ్లైపోయింద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌ని చెబుతూనే.. పాత బంధాల గురించి బ‌య‌ట ప‌డింది శృతిహాస‌న్. అవును.. గ‌తంలో తాను ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో రిలేష‌న్ షిప్ లో ఉన్నాను.. కానీ వాళ్లు తన‌ను కంట్రోల్లో ఉంచుకోవాల‌ని చూసారు. అందుకే త‌ను ఆ రిలేష‌న్ షిప్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాన‌ని చెప్పింది శృతిహాస‌న్. ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు ధ‌నుష్, సిద్ధార్థ్ అని కోలీవుడ్ తో పాటు అంద‌రికీ తెలిసిన నిజాలే. ఇక ఇప్పుడు లండ‌న్ బాయ్ ఫ్రెండ్ తో రిలేష‌న్ షిప్ లో ఉంది శృతిహాస‌న్. మొత్తానికి త‌న‌ను తొక్కేయాల‌ని చూస్తే.. వాళ్ల‌నే ప‌క్క‌న బ‌డేసింది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories