English   

ఇదేం ట్రైలర్ ‘సామి’

This is the trailer 'Sami'
2018-06-04 06:47:56

ఇప్పుడిప్పుడే సౌత్ సినిమా మారుతోంది. రొటీన్ రొడ్డకొట్టు సినిమాల నుంచి బయటపడుతోంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ దశాబ్ధం వెనక్కి వెళ్లి సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? ఎలా ఉంటుంది.. సామి ట్రైలర్ లా ఉంటుంది. ఇంతకీ ఈ సామి ఎవరో తెలుసు కదా.. విక్రమ్ హీరోగా నటించిన సినిమా. దాదాపు పదిహేనేళ్ల క్రితం వచ్చిన సామికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. సామి-2 అంటూ. ఇలాంటి ఊరమాస్ సినిమాలు తెరకెక్కించడంలో ఎక్స్ పర్ట్ అయిన హరి దర్శకుడు. ఇక హరి అంటే ఒక్క ఫ్రేమూ కుదురుగా ఉండదు కదా. స్క్రీన్ ప్లే పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ఇదంతా గతం. సింగం సీక్వెల్ లో మూడు సినిమాలు తీస్తే.. వరుసగా డౌన్ అవుతూ వచ్చిందే కానీ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవలేదు. దానర్థం.. మరీ అంత మాస్ అంటే చూడలేం అని ప్రేక్షకులు చెప్పడమే. అయినా మారని హరి సామి-2తోనూ అదే చేశాడు.

విక్రమ్ కు హీరోగా మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో సామి ముందుంటుంది. కానీ ఇది గతంలో. ఇప్పుడు మన సినిమాలు మారుతున్నాయి. కంటెంట్ బేస్డ్ గా వెళ్లేందుకే స్టార్ హీరోలూ ఇష్టపడుతున్నారు. అలాంటిది ఈ ట్రైలర్ చూస్తే తలనొప్పి ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంది. ఇక ఆఫైట్స్ చూస్తే అతికే అతి అన్నట్టుగా ఉన్నాయి. ఇవాళా రేపూ ఇవి హిందీ డబ్బింగ్ మార్కెట్ కు తప్ప మనకు పనిచేయడం లేదు. అటు విక్రమ్ అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే తనకు మళ్లీ ఈ సామి-2 లక్ తెస్తుందనుకుంటున్నాడేమో కానీ.. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత అక్కడ కమెంట్స్ చూస్తే తెలుస్తుంది.. వీళ్లెంత అవుట్ డేటెడ్ గా ఉన్నారనేది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఊరమాస్ కే బాస్ లా ఉంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ తెస్తుందో కానీ.. ఇప్పటికైతే విక్రమ్ వీరాభిమానులు కూడా యూ ట్యూబ్ లో నెగెటివ్ కమెంట్స్ చేస్తున్నారు.. అసలుఇదేం ట్రైలర్ సామీ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. 

More Related Stories