English   

 తొలిప్రేమ‌..4 రోజుల్లోనే 25 కోట్లు..

tholi-prema

వ‌రుణ్ తేజ్ దూకుడు మామూలుగా లేదు. అస‌లే ఆక‌లితో ఉన్న ప్రేక్ష‌కుల‌కు వింధు భోజ‌నంలా తొలిప్రేమ లాంటి సినిమా ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. దాంతో తొలిరోజు నుంచే ఈ సినిమాతో పండ‌గ చేసుకుంటున్నారు ప్రేక్ష‌కులు. తొలిరోజే ఈ చిత్రానికి సూప‌ర్ టాక్ వ‌చ్చింది. ఇక క‌లెక్ష‌న్ల‌కు అడ్డేం ఉంటుంది చెప్పండి. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్.. 15 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రాశీఖ‌న్నా హీరోయిన్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో 10.77 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. నైజాంలో 4.08 కోట్ల షేర్ తీసుకొచ్చాడు వ‌రుణ్ తేజ్. ఏపీ, తెలంగాణ‌ల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు. ఈ సినిమాను 20 కోట్ల‌కు అమ్మేసాడు. ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 15 కోట్ల షేర్ వ‌చ్చింది. మ‌రో 5 కోట్లు మాత్ర‌మే బ్యాలెన్స్. ఈ వారాంతంలో అ.. త‌ప్ప ఇంకేం సినిమాలు కూడా లేవు. దాంతో తొలిప్రేమ దూకుడు ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఫుల్ ర‌న్ లో ఈ సినిమా ఈజీగా 25 కోట్ల షేర్ అందుకునేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే వ‌రుణ్ కెరీర్ కు మ‌రో బ్రేక్ దొరికిన‌ట్లే..!

More Related Stories