English   

పాపం అఖిల్.. మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ మొద‌లు..

Akhil-venky
2018-03-10 16:14:38

ప‌ట్టుమ‌ని పాతికేళ్లు కూడా లేవు.. కానీ ఇప్పుడే అన్ని క‌ష్టాలు అఖిల్ కే వ‌చ్చాయి. ఏం చేస్తున్నాడో.. ఏం చేయాలో.. ఏం చేస్తే బాగుంటుందో అన్నీ క‌న్ఫ్యూజ‌న్ లోనే ఉన్నాడు సిసింద్రీ. అస‌లే ఈ హీరోల్లో పోటీ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క ఫ్లాప్ వ‌స్తే.. ఎప్పుడెప్పుడు సినిమా చేసి మ‌ళ్లీ హిట్ కొడదామా అనే క‌సితో ఉంటారు హీరోలు. స్టార్ హీరోల సంగ‌తేమో కానీ కుర్రాళ్లైతే ఫ్లాప్ ఇస్తే రేస్ లో వెన‌క్కి వెళ్లిపోవ‌డం ఖాయం. ఇది తెలిసినా కూడా అఖిల్ మాత్రం మార‌ట్లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడు. ఈ హీరో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మూడేళ్లైపోయింది. చేసింది రెండు సినిమాలు. 

తొలి సినిమాకు.. రెండో సినిమాకు మ‌ధ్య గ్యాప్ రెండేళ్ల‌కు పైనే. ఇదే అఖిల్ కొంప ముంచేసింది. మ‌ళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నాడు సిసింద్రీ. డిసెంబ‌ర్ లో అఖిల్ తో పాటే వ‌చ్చిన నాని.. ఎంసిఏ త‌ర్వాత కృష్ణార్జున యుద్ధం షూట్ పూర్తి చేసాడు. కానీ ఇప్ప‌టికీ అఖిల్ మాత్రం మూడో సినిమాపై క్లారిటీ ఇవ్వ‌డం లేదు.  ఆ మ‌ధ్య స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టితో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది కానీ ఇప్ప‌టికీ దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు అఖిల్. ఇప్పుడు సుకుమార్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో క‌థ కూడా సిద్ధ‌మైపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.  

అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు మిస్ అయిపోయింది. అయితే మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా మాత్రం అలాగే ఉంది. కాక‌పోతే సుకుమార్ స్థానం లోకి వెంకీ అట్లూరి వ‌చ్చి చేరాడు. అవును.. ఈ మ‌ధ్యే తొలిప్రేమ‌తో క్లాసిక్ హిట్ అందుకున్న వెంకీ ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయ‌బోతున్నాడు. అయితే ఈ విష‌యంపై కూడా నోరు విప్ప‌డం లేదు అఖిల్. అడిగితే గ్యాంగ్ లీడ‌ర్ చిరంజీవిలా అన్నీ త‌ర్వాత చెబుతా.. తీరిగ్గా చెబుతా అంటున్నాడు. వెంకీ అట్లూరి క‌థ సిద్ధం చేయ‌డానికి క‌నీసం మ‌రో ఆర్నెళ్లైనా ప‌డుతుంది. అందుకే జూన్ త‌ర్వాత అఖిల్ మూడో సినిమా ఉండొచ్చ‌ని తెలుస్తుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. అప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ఆగుతాడో.. లేదంటే గ్యాప్ ఉంది క‌దా మ‌రో సినిమా చేస్తాడో..?

More Related Stories