English   

ప్రకాశ్ రాజ్‌ను చంపేస్తాం.. జనవరి 29న ముహూర్తం..

Prakash Raj
2020-01-27 15:48:13

కొన్నిరోజులుగా సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నాడు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ఈయనకు అక్కడ కూడా శత్రువులు ఎక్కువైపోతున్నారు. రాజకీయాల్లో భాగంగా ఈయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బిజేపీతో పాటు ప్రధానిపై కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అప్పట్నుంచే ఈయనపై కన్నేసారు కొందరు. ముఖ్యంగా ప్రకాశ్ పద్దతి మార్చుకోకపోతే చంపేస్తామంటూ చాలా మంది వార్నింగులు కూడా ఇస్తున్నారు. 

తాను చావుకు భయపడను అంటూ ప్రకాశ్ రాజ్ కూడా ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే జనవరి 29న ప్రకాశ్ రాజ్ ను హతమారుస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. వీళ్ల హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, నిజాగుణానంద స్వామితో పాటు మరో 13 మంది కూడా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ఈ లేఖను కన్నడలో రాసారు.. అందులో ఈ లేఖలో ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్నవారిని చంపేయడానికి జనవరి 29ని ముహూర్తంగా నిర్ణయించామని.. అంతా అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలంటూ రాసి ఉంది. దాంతో పోలీసులు వెంటనే ప్రకాశ్ రాజ్, కుమార స్వామితో పాటు నిజగుణానంద స్వామి మఠానికి కూడా భద్రత ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే దీనికి నిజగుణానంద స్వామి తిరస్కరించారు. కుమారస్వామి కూడా తనను చంపేస్తామని బెదిరించినట్లు ట్వీట్ చేసాడు. మరి ఈ సీన్ ఎక్కడ ముగుస్తుందో చూడాలిక. 

More Related Stories