English   

మూడు సినిమాలు - బాక్సాఫీస్ రివ్యూ 

threefilms
2018-07-16 20:41:17

గత వారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఒకే సినిమాకు వచ్చాయి. వస్తున్నాయి. అంటే మిగతా సినిమాల్లో మంచి కంటెంట్ లేదనేం కాదు.. కానీ ఆ కంటెంట్ కొత్తది కాదు. అలాగే రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే అలరిస్తోన్న సినిమాలవి. అందుకే టాక్ పాజిటివ్ గా ఉన్నా టికెట్స్ భారీగా తెగడం లేదు. దీంతో ఈ మూడు సినిమాలూ భిన్నమైన రిజల్ట్స్ చూస్తున్నాయి. ఒకటి అంచనాలు అందుకుంటే.. మరొకటి మించిపోయింది.. ఇంకొకటి.. ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. 

విజేత  :  
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన సినిమా ఇది. రాకేశ్ శశి అనే దర్శకుడు రూపొందించాడు. వారాహి బ్యానర్ నిర్మించిన సినిమా. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కళ్యాణ్ బాగా చేశాడన్నారు. కానీ వారాహి బ్యానర్ ఫేట్ మాత్రం మారలేదు. గత కొన్నాళ్లుగా హిట్లే లేకుండా ఉండిపోయిన ఈ బ్యానర్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. అటు ఓవర్శీస్ లో ఈ సినిమాను అస్సలు పట్టించుకున్నవారు లేరు. తెలుగులో మాత్రమే అంతంతమాత్రంగా కలెక్షన్స్ రాబడుతోంది. తండ్రి కొడుకుల నేపథ్యంలో మంచి సెంటిమెంట్ సినిమాగా పేరొచ్చినా.. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఫ్లాప్ గానే తేలేలా ఉందంటున్నారు విశ్లేషకులు.

ఆర్ఎక్స్ 100 : 
అంతా కొత్తవారు చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కార్తికేయ హీరోగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆర్ఎక్స్ హండ్రెడ్ మోతకు బాక్సాఫీస్ ఊగిపోతోంది. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రోజు రోజుకు ఆ కలెక్షన్స్ పెరుగుతున్నాయో కానీ తగ్గడం లేదు. నాలుగు రోజుల్లో ఏకంగా ఐదున్నర కోట్ల షేర్ వసూలు చేసి పెద్ద స్టార్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది. ఇక హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కంటెంట్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది.. మొత్తంగా ఆర్ఎక్స్ 100 ఈ వారమే కాదు.. ఈయేడాది మొత్తానికే ఓ సర్ ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. 

చినబాబు : 
కార్తీ హీరోగా నటించిన కడైకుట్టి సింగం ను తెలుగులో చినబాబుగా డబ్ చేశారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ ఓపెనింగ్స్ నిలబడేంత గట్టి కంటెంట్ మాత్రం సినిమాల మిస్ అయిందనే టాక్ వచ్చింది. అలాగని సినిమాకు బాలేదనే టాక్ మాత్రం రాలేదు. కానీ హిట్ అనిపించుకునేంత గొప్ప కంటెంట్ లేదంటున్నారు. అఫ్ కోర్స్ ఇది కాస్త తమిళ వాసనలున్న సినిమా కాబట్టి మనవారికి నచ్చలేదు.. కానీ కోలీవుడ్ లో హిట్ గా నిలిచింది. సో.. కార్తీకి తెలుగులో మరోసారి నిరాశ తప్పేలా లేదంటోంది ట్రేడ్.. 

ఫైనల్ గా అసలు విషయం ఏంటంటే.. ఈ వారం ఈ మూడు సినిమాలూ ఓవర్శీస్ లో అస్సలేమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఉన్నంతలో ఆర్ఎక్స్ 100మాత్రం హాఫ్ మిలియన్ కు చేరువగా వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మెప్పించే సినిమా కాదు కాబట్టి.. ఇక అంతకు మించి కలెక్ట్ చేసేలా లేదు. సో ఓవరాల్ గా ఇదీ ఈ వారం బాక్సాఫీస్ రిజల్ట్ గా చెప్పొచ్చు. 

More Related Stories