English   

ఆమిర్ ఖాన్ కు గర్వభంగం.. రాజమౌళి రికార్డ్స్ సేఫ్ ..?

Thugs-of-Hindostan
2018-11-08 16:46:46

సినిమా ఇండస్ట్రీ అనేది పోటీ ప్రపంచం. ముఖ్యంగా ఏ రికార్డ్ కూడా ఎక్కువ రోజులుండదు. ఉన్నదీ అంటే ఆ సినిమాను ఢీ కొట్టే సినిమా ఇంకా రాలేదని అర్థం. అయితే ఈ మధ్య ఏ రికార్డ్ కూడా ఎక్కువ రోజులు నిలవడం లేదు. ఇక ఓ ప్రాంతీయ భాషా చిత్రంగా మొదలై ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించుకున్న బాహుబలి రికార్డ్స్ కూడా త్వరగానే పోతాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బాహుబలి రెండో భాగం నెలకొల్పిన రికార్డ్న్ ను ఇప్పట్లో ఎవరూ బీట్ చేయలేరు అనుకున్నారు. కాకపోతే ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా దానికి దాదాపుగా దగ్గరగా వచ్చింది. దంగల్..  బాహుబలి రికార్డ్స్ ను దాటేస్తుందనుకున్నారు. కానీ ఆమిర్ కు అది సాధ్యం కాలేదు. కాకపోతే చైనాలో మాత్రం దాటేశాడు. నాన్ బోర్డర్ రికార్డ్స్ మనకు అక్కర్లేదు. అయిలే లేటెస్ట్ గా వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తో బాహుబలి రికార్డ్స్ చెరిగిపోతాయనుకున్నారు.. బట్ నో ఛాన్స్ అంటున్నాయి రివ్యూస్. 

అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పూర్తిగా నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఏ మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలు అంటూ రివ్యూవర్స్ ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2 గంటల 44 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమాలో కనీసం నాలుగు కూడా మంచి సీన్స్ లేవని సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్.. అసలు ఇలాంటి సినిమాను అమితాబ్, ఆమిర్ వంటి లెజెండ్స్ ఎలా యాక్సెప్ట్ చేశారని విమర్శిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీసం ఆ బడ్జెట్ ను కూడా రికవర్ చేయడం కష్టం అంటున్నారు. ఈ యేడాదికి బిగ్గెస్ట్ బోరింగ్ సినిమా ఇదే అంటూ సోషల్ మీడియాలోనూ సెటైర్స్ పడుతున్నాయి. సో.. ఓ భారీ సినిమా వస్తోంది.. అన్ని రికార్డ్స్ బద్ధలవుతాయి.. అంటూ నిన్నటి వరకూ తెగ గప్పాలు కొట్టిన ఆమిర్ అండ్ బ్యాచ్ ఇప్పుడేం చెబుతుందో చూడాలి. మొత్తంగా ఇప్పటి వరకూ బాహుబలి చూడలేదు అంటూ అదేదో గొప్ప అన్నట్టుగా చెప్పే ఆమిర్ ఖాన్ కు మరోసారి గర్వభంగం అయిందని చెప్పొచ్చు. ఏదేమైనా బాహుబలి రికార్డ్స్ మాత్రం సేఫ్ గానే ఉండిపోతున్నాయ్.

More Related Stories