English   

బన్నీ సినిమాకి అక్కడ సీక్వెల్ 

allu arjun
2020-08-10 09:18:59

అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘పరుగు’ అనే లవ్ స్టోరీ తెలుగులో హిట్ కాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా మన దగ్గర బాగా ఆడకున్నా ఈ సినిమాని బాలీవుడ్ లోకి రీమేక్ చేశారు. ఈ సినిమా  హీరో పంతి అనే టైటిల్ తో రీమేక్ అయ్యి అక్కడ హిట్ కొట్టింది. జాకీ ష్రాఫ్ కొడుకుగా టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్కడ మాత్రం మంచి హిట్ గా నిలిచింది. అయితే మనవాళ్ళు ఈ సినిమా గురించి మర్చిపోయినా అక్కడి మేకర్స్ మాత్రం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మధ్య ఫ్లాప్ లు మూటగట్టుకున్న టైగర్ ష్రాఫ్ కూడా ఈ సినిమా సీక్వెల్ కు ఒకే చెప్పాడని అంటున్నారు. అంతే కాక తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో బన్నీ గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని సాజిద్ బన్నీని అప్రోచ్ అయ్యినట్లు చెబుతున్నారు. మరి  మన సినిమాకి వాళ్ళు సీక్వెల్ ప్లాన్ చేస్తే మనోళ్ళు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతారా ?  వేచి చూద్దాం !

More Related Stories