English   

భాగీ 2.. ఒక్క క్ష‌ణం ఆగండోయ్..!

baaghi 2
2018-02-22 15:06:13

బాలీవుడ్ లో కొత్త క‌థ‌లు రాయ‌డం పూర్తిగా మానేసిన‌ట్లున్నారు. సింపుల్ గా ప‌క్క భాష‌ల్లో వ‌చ్చిన సినిమాల‌ను చూస్తున్నారంతే. లేదంటే బ‌యోపిక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికీ ఇదే చేస్తున్నారు అక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా విడుద‌లైన భాగీ 2 ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా మ‌న మైండ్ లోకి వ‌చ్చే సినిమా క్ష‌ణం. తెలుగులో రెండేళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. అడ‌వి శేష్, అదాశ‌ర్మ జంట‌గా వ‌చ్చిన ఈ సినిమాను ర‌వికాంత్ ప‌రేపు తెర‌కెక్కించాడు. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో భాగీ 2గా రీమేక్ చేసారు. దాన్ని రీమేక్ అన‌కూడ‌దేమో మ‌రి ఫ్రీ మేక్ అనాలి. ఎందుకంటే చెప్ప‌కుండా తీసుకున్నారు కాబ‌ట్టి.

ట్రైల‌ర్ లో యాక్ష‌న్ నింపేస్తే గుర్తు ప‌ట్ట‌కుండా ఉంటారేమో అనుకున్నారు కానీ క‌థ‌ను మాత్రం అలాగే వ‌దిలేయ‌డంతో దొంగ‌లు దొరికేసారు. భాగీ వ‌ర్షం సినిమాకు రీమేక్ అయితే.. ఇది క్ష‌ణం సినిమాకు ఫ్రీమేక్. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా కాపీరైట్ ఇష్యూ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అక్క‌డ టైగ‌ర్ ష్రాఫ్, దిశాప‌టానీ జంట‌గా న‌టించారు ఈ చిత్రంలో. అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌కుడు. సాజిద్ న‌డియావాలా నిర్మాత‌. గ‌తంలోనూ ఈయ‌న తెలుగు సినిమాల‌నే హిందీలోకి కాపీ చేసాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. మార్చ్ 30న భాగీ 2 విడుద‌ల కానుంది. టైగ‌ర్ ష్రాఫ్ కు తెలుగు సినిమాలు బాగానే క‌లిసొచ్చాయి. వ‌ర్షం.. ప‌రుగు లాంటి రీమేకులు టైగ‌ర్ కెరీర్ కు బాగానే హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి రీమేక్ సినిమాతోనే వ‌స్తున్నాడు. చూడాలిక‌.. ఈ సారి ఏం చేస్తాడో..?
 

More Related Stories