English   

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య..

 TikTok star Siya Kakkar
2020-06-26 08:06:26

ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు చావు అంచుకు వెళ్తున్నారు సెలబ్రిటీస్. 10 రోజుల కింద బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన గాయం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తార కూడా నేలరాలింది. టిక్‌టాక్ లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న 16 ఏళ్ల సియా కక్కర్ ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ఈమె మరణంపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తమ కూతురు చావుకు కారణాలేంటో వీళ్లకు కూడా తెలియడం లేదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన సోషల్ మీడియాలో ఈమె చావు గురించి పోస్ట్ చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈమెకు టిక్ టాక్ లో 1.1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 91 వేలకు పైగా ఫాలోవర్లను ఉన్నారు. సియా కక్కర్‌కు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. టిక్‌టాక్‌లో ఈమె వీడియోస్ చాలా వైరల్ అయిపోయాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌లో సుమారు 20 గంటల వీడియోలను పోస్ట్ చేసింది. తన చివరి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, సియా కక్కర్ పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. 

More Related Stories