English   

1997 అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రకాష్ రాజ్

1997 movie
2021-11-16 20:43:25

 డా.మోహన్ స్వీయదర్శకత్వంలో, ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న తాజా చిత్రం 1997. ఇందులో డా మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ ను మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే.

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అల్ సాంగ్  కు కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. తాజాగా టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 1997 సినిమాలోని పాట విన్నాను. కథ గురించి తెలుసుకున్నాను. ప్రస్తుత రోజుల్లో మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి ఈ సినిమా తెరకెక్కించడం బాగుంది.

ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమా లొ నటించడంతో పాటుగా సంగీతాన్ని కూడా అందించడం విశేషం. ఈ సినిమాకు నిర్మాతగా మీనాక్షి రమావత్ వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో నటీనటుల విషయానికి వస్తే..డా మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,కోటి, బెనర్జీ, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.

More Related Stories