English   

శ్యామ్ కే నాయుడు పై నటి శ్రీసుధ మరోసారి ఫిర్యాదు

Sri Sudha
2021-02-26 10:57:29

నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారును గుద్దిన దుండగులు హత్యయత్నానికి ప్రయత్నించారని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాక్సిడెంట్ వెనక శ్యామ్ కే నాయుడు పత్ర ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు ఐదేళ్లు సహజీవనం చేసాడని...ఆ తరవత మోసం చేశాడని హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ క్రమంలో కేసును ఉపసంహరించుకోవాలంటూ శ్యామ్ కె నాయుడు ఒత్తిడి చేస్తున్నాడని..అతడివల్ల ప్రాణహాని ఉందని కొద్ది రోజులక్రితం పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు శ్రీ సుధ మళ్ళీ ఏపీ పోలీసుల ను ఆశరించడంతో ఈ కేసు ఏపీకి కూడా చేరింది. వియాజయవాడ లో చేసిన ఫిర్యాదు లో ఎస్ ఆర్ నగర్ కేసుతో లింకులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక ఇదే కేసులో శ్యామ్ కే నాయుడు తాను రాజీ పడినట్టు నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించారని ఎసిబి అధికారులకు సైతం ఫిర్యాదు చేసింది. శ్రీ సుధ అర్జున్ రెడ్డి సినిమాతో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

More Related Stories