English   

మీడియాతో య‌వ్వారం.. ఎవ‌రికి న‌ష్టం..? 

tollywood-media
2018-05-01 12:47:44

ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్దలంతా క‌లిసి ఇప్పుడు మీడియాను బ్యాన్ కాని బ్యాన్ చేయాల‌ని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే శ్రామికుల దినోత్స‌వ‌మైన మే 1 వ‌దిలేసి.. ఈ వార్త‌ను మే 2న అనౌన్స్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే కానీ జ‌రిగితే ఇప్పుడు మీడియాలో సంచ‌ల‌నాలు జ‌ర‌గ‌డం ఖాయం. ఈ లిస్ట్ లో ఒక్క ఎన్టీవీ మాత్ర‌మే సేఫ్ జోన్ లో ఉంది. ఈ ఛానెల్ కు ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ‌కు ఏ సంబంధం లేదు. కానీ అంద‌రితో పాటే త‌ను అన్న‌ట్లు ఈ ఛానెల్ కు ఇప్పుడు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు మిగిలిన వాళ్లు చేసిన ప‌నికి. మ‌రీ ముఖ్యంగా టివి 9.. ఏబిఎన్.. మ‌హాన్యూస్.. టివి 5ల‌పై ఈ బ్యాన్ ప‌ని చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మీడియాతో గోక్కోవ‌డం ఇండ‌స్ట్రీకి కూడా న‌ష్ట‌మే. త‌మ‌పై కానీ అఫీషియ‌ల్ గా బ్యాన్ వేస్తే క‌న‌క ఇండ‌స్ట్రీ చీక‌టి కోణాల‌న్నీ బ‌య‌టికి లాగే ప‌నుల్లో ఉంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు వాళ్లు. 

ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర ఉన్న వీడియో ఫుటేజ్ మొత్తం ప్ర‌జ‌ల ముందు పెడ‌తాం అంటున్నారు వాళ్లు. మీడియాపై బ్యాన్ చేస్తే అది ఇండ‌స్ట్రీకే న‌ష్ట‌మ‌ని ఛానెల్స్ ఎడిట‌ర్స్ అంటున్నారు. తాము కూడా య‌ద్ధానికి సిద్ధంగా ఉంటామ‌ని.. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న స‌మ‌స్య‌ల‌ను వ‌దిలేసి అది చూపించిన మీడియాను బ్యాన్ చేయ‌డం అనేది పిల్లి క‌ళ్లు మూసుకుని పాలు తాగ‌డం లాంటిది అంటున్నారు మీడియా పెద్ద‌లు. అయితే తెగేవ‌ర‌కు లాగితే ఇద్ద‌రికి న‌ష్ట‌మే. ఇప్పుడు ఇండ‌స్ట్రీ మీడియాను బ్యాన్ చేస్తే.. కోట్ల రూపాయ‌ల యాడ్స్ న‌ష్టపోతారు. ఇక ఇండ‌స్ట్రీకి కూడా పెద్ద సినిమాల వ‌ర‌కు ఓకే కానీ చిన్న సినిమాలు ఎప్పుడు వ‌స్తున్నాయ‌నే సంగ‌తి చెప్పేదే మీడియా. అది లేక‌పోతే చిన్న నిర్మాత‌లు రోడ్డున ప‌డ‌తారు. మ‌రి చూడాలిక‌.. ఈ వ్య‌వ‌హారం ఎంత‌దూరం వెళ్తుందో ఇలాగే..!

More Related Stories