English   

టి.వి  ఛానల్స్ పై బ్యాన్..?  కన్ఫార్మ్ అయిందా..?

Ban-on-TV-channels
2018-04-30 11:32:29

అనుకున్నంతా అయింది. చినికిచినికి గాలివానగా మారిన ఛానల్స్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ గొడవ ముదిరిపోయింది. కొన్ని రోజుల క్రితం రూమర్ గానే వచ్చిన వార్త మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా అనౌన్స్ కాబోతోంది. యస్ తెలుగు టివి ఛానల్స్ ను సినిమా పరిశ్రమ బ్యాన్ చేయాలనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికే సిద్ధమైంది. అయితే ముందు నుంచీ చెబుతున్నట్టు టివి9, టివి5, ఏబిఎన్ లను మాత్రమే బ్యాన్ చేస్తారా లేక.. మిగతా ఛానల్స్ ను కూడా బ్యాన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. సందట్లో సడేమియాలాగా ఇదే సందర్భంలో వెబ్ సైట్స్ ను వద్దనుకుంటోంది పరిశ్రమ. ఇందులో చాలా వరకూ తమ మాట వినని సైట్స్ మాత్రమే ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. 

అసలు టివి ఛానల్స్ ను బ్యాన్ చేయాలని ఫిలిమ్ చాంబర్ ఎందుకు నిర్ణయించుకుంది. గత కొన్నాళ్లుగా పరిశ్రమలో జరుగుతోన్న విపరీత వింత పోకడలు గమనిస్తూ వస్తోన్న ఇండస్ట్రీ అసలు ఇలాంటి ఛానల్స్ ను మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలనే నిర్ణయానికొచ్చింది. టివి5లో ఓ యాంకర్ సినిమా పరిశ్రమలో లం.. ముండలు లేరా అన్నదగ్గర్నుంచీ మొదలైన ఈ యుద్ధం.. శ్రీ రెడ్డి సడెన్ ఎంట్రీతో కొత్త మలుపు తీసుకుంది. కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నుంచి మొదలైన టివి చానల్స్ చర్చలు సభ్య సమాజాన్ని విపరీతంగా బోర్ కొట్టించడమే కాద.. నిజంగానే కొన్ని చర్చలు అర్థం పర్థం లేకుండా సాగాయి. ఇందులో ప్రధానంగా పరిశ్రమదే తప్పు అని వాదించినవారే ఎక్కువ. ఇక వస్తోన్న క్రేజ్ ను చూసో లేక నిజంగానే విసిగిపోయిందో కానీ శ్రీ రెడ్డి ఏకంగా ఫిలిమ్ చాంబర్ వద్ద చేసిన అర్థనగ్న ప్రదర్శన మొత్తం పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వెంటనే ఆమెకు ‘మా’ సభ్యత్వం ఇవ్వం అని ఖరాఖండీ చెప్పేసింది మా. కానీ మానవ హక్కుల సంఘం ఎంట్రీతో.. అలాంటిదేం లేదంది. అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది అనుకుంటోన్న టైమ్ లో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు.. వాటికి టివి ఛానల్స్ కల్పించిన ప్రచారం పరిశ్రమను బాధించాయి. దీంతో అసలు మనపై ఆధారపడే ఛానల్స్ మనల్ని విమర్శించడమేంటీ అనే రివర్స్ గేర్ వేశాయి.
 
ఇక పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాడు. ఆ వెంటనే చిరంజీవి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందర్నీ కలిపి ఓ మీటింగ్ పెట్టాడు. అంతా కలిసి ఈ వ్యవహారాలపై ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇది ఎలాంటి నిర్ణయం అని తెలియకుండానే టివి5 నుంచి మరో యాంకర్ ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఇవన్నీ గమనిస్తోన్న పరిశ్రమ మొత్తానికి  ఓ నిర్ణయానికి వచ్చేసింది. అయితే అది ఎలాంటి నిర్ణయం అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇంకా చెబితే మే 4న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆ రోజు దర్శకుల సంఘంతో పాటు మొత్తం పరిశ్రమ ఒకే వేదికపైకి రానుంది. ఆ సందర్భంగా ఈ విషయాపై ఓ స్పష్టమైన ప్రకటన చేయబోతోంది పరిశ్రమ. అయితే టివి ఛానల్స్ ను పూర్తిగా బ్యాన్ చేయడం అసాధ్యం కాబట్టి.. వారికి ఇచ్చే యాడ్స్, కంటెంట్స్ విషయంలో భారీ కోత విధించాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారని టాక్. ఇన్నాళ్లూ తమను డిమాండ్ చేసిన చానల్స్ కు ఇకపై తాము ఇచ్చిందే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరించబోతోంది. అలాగే వెబ్ సైట్స్ విషయంలోనూ ఇది వర్తింప చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రీ గురించి చీప్ గా ప్రచారం చేస్తూ.. మార్ఫింగ్ ఫోటోస్ తో దిగజారుడు ప్రచారాలు చేస్తోన్న కొన్ని వెబ్ సైట్స్ తో పాటు యూ ట్యూబ్ ఛానల్స్ ను కూడా ఇప్పటికే గుర్తించారు. అలాంటి వాటిలో కొన్నిటిని పూర్తిగా బ్యాన్ చేయబోతున్నట్టు టాక్. ఏదేమైనా ఇండస్ట్రీ వర్సెస్ మీడియా అనేది తెలుగులో మొదటి సారిగా జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధం. ఈ యుద్ధంలో సమిధలెవరు అనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

More Related Stories