English   

ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి వారే.. యమున‌కి నీరే..!

tollywood-biggies

త‌మ‌దాకా వ‌స్తే కానీ క‌ష్టం విలువ తెలియ‌దంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి వాళ్లు అలాగే ఉన్నారు. త‌మ ఇంటి వ‌ర‌కు వ‌స్తే కానీ ఆ క‌ష్టం ఎలా ఉంటుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ రోజు మెగా ఫ్యామిలీకి వ‌చ్చింది.. రేపు మ‌రో ఫ్యామిలీకి వ‌స్తుంది. కానీ రావ‌డం మాత్రం ప‌క్కా. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే తెలుగు ఇండ‌స్ట్రీని చూసి ప‌క్క ఇండ‌స్ట్రీలన్నీ న‌వ్వుకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఇంత అంత అని చెప్పుకున్న ఇండ‌స్ట్రీపై రాళ్లు ప‌డుతుంటే పెద్ద‌లంతా కామ్ గా నోరు మూసుకుని కూర్చున్నారు. ఇదే అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న విష‌యం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తే కానీ పెద్ద త‌ల‌కాయ‌ల‌న్నీ ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికి కూడా వ‌చ్చింది కేవ‌లం మెగా కుటుంబ‌మే. అది కూడా త‌మ‌కు జ‌రిగిన అవ‌మానాన్ని నిల‌దీయ‌డానికే. ఏం.. ఇండ‌స్ట్రీలో మెగా కుటుంబం ఒక్క‌టే ఉందా.. ద‌గ్గుపాటి కుటుంబం ఏమైంది..? న‌ంద‌మూరి కుటుంబం ఎక్క‌డ.. అక్కినేని వార‌సుడు క‌నిపించ‌ట్లేదే..? ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి వాళ్లు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు క‌నిపిస్తున్నారు. త‌మ ఇంటి వ‌ర‌కు వ‌స్తే కానీ ఎవ‌రికి క‌ష్టమంటే ఏంటో అర్థం కావ‌డం లేదు. ఇండ‌స్ట్రీలో ఐక‌మ‌త్యం అనేది లేక‌పోవ‌డంతోనే ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందంటున్నారు అంతా. దాన్ని కాద‌నే వాళ్లు కూడా లేరు. ఎందుకంటే అదే నిజం కాబ‌ట్టి. పెద్ద‌రికం చూపించే వాళ్లు లేక‌.. ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఐక‌మ‌త్యం వ‌చ్చిన రోజే ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా కూడా ప‌రిష్కారం అవుతుందంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి అది వ‌చ్చేనా..? ఇది జ‌రిగేనా..? 

More Related Stories