English   

ప‌వ‌న్ ట్వీట్లు.. ఆ ముగ్గురి చ‌ర్చ‌లు విఫ‌లం.. 

Tollywood-pawan
2018-04-21 10:19:59

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ‌కు ముగ్గురు కీల‌క‌మైన వ్య‌క్తులు కార‌ణం అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీని శాసించ‌గ‌లిగే స్థాయి ఉన్న ముగ్గురు వ్య‌క్తులు వాళ్లు. వాళ్లే కానీ త‌లుచుకుంటే ఇండ‌స్ట్రీలో ఏదైనా జ‌రుగుతుంది.. ఏదైనా ఆగిపోతుంది. అంత‌టి ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న బ‌ల‌మైన ముగ్గురు వ్య‌క్తులు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ర‌చ్చ‌పై వాళ్లు ఎప్రిల్ 19 రోజు రాత్రి 12 గంటల వ‌ర‌కు హైద‌రాబాద్ లోని పేరు మోసిన ఓ స్టార్ హోట‌ల్లో ఆ ముగ్గురు కూర్చుని చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. కానీ అవి అనుకున్నంత‌గా స‌ఫ‌లం కాలేద‌ని.. అందుకే ఉన్న‌ఫ‌లంగా ప‌వ‌న్ ట్వీట్ల వ‌ర్షం రాత్రి 12 గంటల నుంచే మొద‌లైంది. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఇలాంటి ఓ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని ఎవ‌రికీ తెలియ‌దు. ఇండ‌స్ట్రీలో కూడా ఎవ‌రికీ అర్థం కాలేదు ఏం జ‌రుగుతుందో..? ఉన్న‌ట్నుంచి ప‌వ‌న్ అలా పెద్ద‌స్థాయి వ్య‌క్తుల ఫోటోలతో పాటు వాళ్లు త‌న‌పై కుట్ర చేస్తున్నారంటు ట్వీట్ చేయ‌డం మాత్రం సంచ‌ల‌నంగా మారింది. ప‌వ‌న్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. కానీ దీని వెన‌క మాత్రం ఆ ముగ్గురు వ్య‌క్తులు ఉన్నారు. అందులో ఒక సీనియ‌ర్ స్టార్ హీరో.. ఇద్ద‌రు సీనియ‌ర్ నిర్మాత‌లు ఉన్నారు. అక్క‌డ చ‌ర్చ‌లు స‌జావుగా సాగ‌లేదు కాబ‌ట్టే ఇక్క‌డ ప‌వ‌న్ ట్వీట్స్ వ‌ర్షం మొద‌లైంది. మ‌రి ఆ ముగ్గురు ఎవ‌రో మీ ఊహ‌ల‌కే వ‌దిలేస్తున్నాం ఇక‌..!

More Related Stories