English   

టాలీవుడ్ దర్శకుడికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో..

accident
2020-01-21 20:15:13

ఈ మధ్య తెలుగు సినిమా పరిస్థితి ఏం బాగోలేదు. వరసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య రాజశేఖర్ రోడ్ యాక్సిడెంట్.. గొల్లపూడి మరణం ఇలా చాలా చూసారు. ఇలాంటి తరుణంలోనే మరో చేదు వార్త కూడా వినిపించింది. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు రోడ్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. సప్తగిరి హీరోగా సప్తగిరి ఎల్ఎల్‌బి సినిమా తెరకెక్కించిన మల్లిఖార్జున్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రాణానికి ప్రమాదం లేకపోయినా కూడా గాయాలు భారీగానే కావడంతో కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు తెలుగు దర్శకుల సంఘం తరఫు నుంచి ఆయనకు తమ మద్దతు తెలిపారు పలువురు దర్శకులు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు పెద్దలు ఆయన్ని కలిసి పరామర్శించారు.

More Related Stories