English   

బాల‌య్య కోసం ఎంత‌మంది ద‌ర్శ‌కులో..

balakrishna-tollywood
2018-03-29 14:49:27

బాల‌య్య ఏం చేసినా ఇలాగే ఉంటుంది మ‌రి. అప్ప‌ట్లో ఆయ‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఓపెనింగ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అమ‌రా వ‌తి సాక్షిగా ఈ చిత్రం ఓపెన్అయింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లోనూ శాత‌క‌ర్ణి ఈవెంట్ ఒక‌టి పెట్టాడు బాల‌య్య‌. అందులో చిన్నాపెద్ద తేడాలేకుండా ఇండ‌స్ట్రీ అంతా క‌దిలొచ్చింది. చిరంజీవితో పాటు సిఎం కేసీఆర్ కూడా వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. బాల‌య్య ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టిస్తున్నాడు. రామ‌కృష్ణ స్టూడియోస్ లో జ‌రిగిన ఈ ముహూర్తం కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కులంతా క‌దిలి వ‌చ్చారు. బాల‌య్య‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌కుల‌తో పాటు ప‌నిచేయ‌ని వాళ్లు కూడా వ‌చ్చారు. బోయ‌పాటి శీను.. సుకుమార్.. తేజ‌.. వినాయ‌క్.. రాఘ‌వేంద్ర‌రావ్ తో పాటు ఇండ‌స్ట్రీ అంతా త‌ర‌లివ‌చ్చింది. ఇంత‌మంది ద‌ర్శ‌కుల‌ను ఒకేచోట చూసి అభిమానులు కూడా ఉప్పొంగిపోయారు. ఇక ముహూర్త‌పు షాట్ లో బాల‌య్య అలా ధుర్యోధ‌నుడిగా న‌డిచొస్తుంటే అచ్చంగా అన్న‌గారిని చూసిన‌ట్లే అంతా మురిసిపోయారు. మొత్తానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌న్నుల పండ‌గ‌గా జ‌రిగింది.  

More Related Stories