English   

హిట్ ఇచ్చి భారీ గ్యాప్ తీసుకున్న దర్శకులు వీళ్లే.. 

tollywood directors
2020-07-04 19:19:53

అల వైకుంఠపురములో ఉన్న ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ డైలాగ్ ఇప్పుడు మన దర్శకుల్లో కొందరికి బాగా సూట్ అవుతుంది. హిట్ ఇచ్చిన వెంటనే అవకాశాలు వెల్లువలా వస్తాయి అనుకోవడం తప్పే అవుతుంది వీళ్లను చూస్తే. ఎందుకంటే బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసి కూడా రెండేళ్ల గ్యాప్ తీసుకున్నారు కొందరు దర్శకులు. అలాంటి వాళ్లెవరో చూద్దాం..

సుకుమార్: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత కూడా రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. 2021లోనే ఇది రానుంది. అంటే ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మరీ మూడేళ్లు గ్యాప్ అన్నమాట.

కొరటాల శివ: భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత కూడా ఈయన రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. చిరంజీవి ఆచార్య కోసం తన టైమ్ అంతా వెచ్చించాడు ఈ దర్శకుడు.

పరశురామ్: తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన జాబితాలో గీతగోవిందం కచ్చితంగా టాప్ 10లో ఉంటుంది. అలాంటి సినిమా చేసి రెండేళ్లుగా మరో సినిమా చేయలేదు పరశురామ్. ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేస్తున్నాడు.

సందీప్ రెడ్డి వంగా: అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాను ఊపిసన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఈయనకు తెలుగు ఇండస్ట్రీ కలిసొచ్చేలా కనిపించడం లేదు.

రాజమౌళి: 2017 ఎప్రిల్‌లో బాహుబలి 2 విడుదలైంది. ఈ మధ్యే మూడేళ్లు పూర్తయింది కూడా. ఎప్పట్లాగే రాజమౌళి మరో సినిమా కోసం నాలుగేళ్లు తీసుకుంటున్నాడు.

నాగ్ అశ్విన్: మహానటి లాంటి సంచలన విజయం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికీ ఈయన సినిమా ఇంకా మొదలు కాలేదు. 2018 తర్వాత 2021లోనే ఈయన తర్వాతి సినిమా రానుంది.

రాహుల్ సంక్రీత్యన్: టాక్సీవాలా సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాహుల్.. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. రెండేళ్లుగా ఈయన ఖాళీ. ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. అది 2021లోనే రానుంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ: సమ్మోహనం సినిమాతో అలరించిన ఇంద్రగంటి.. ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు. వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా ఈయనకు కూడా భారీ గ్యాప్ తప్పలేదు.

శేఖర్ కమ్ముల: ఈయన గురించి ఏం చెప్పాలి.. అప్పుడెప్పుడో 2017లో ఫిదా సినిమా చేసాడు. మళ్లీ ఇప్పటి వరకు కనిపించలేదు. బ్లాక్‌బస్టర్ వచ్చిన తర్వాత కూడా మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది కమ్ములకు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.

వేణు శ్రీరామ్: తొలి సినిమా ఓ మై ఫ్రెండ్.. రెండో సినిమా ఎంసిఏకు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న వేణు శ్రీరామ్.. బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇదే ఏడాది విడుదల కానుంది.

తరుణ్ భాస్కర్: పెళ్లిచూపులు తర్వాత తరుణ్ చేసిన ఈ నగరానికి ఏమైంది ప్రాఫిట్ వెంచర్‌గానే నిలిచింది. కానీ ఈ చిత్రం తర్వాత ఇప్పటికీ మరో సినిమా చేయలేదు తరుణ్ భాస్కర్. జూన్ 29తో ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తవుతుంది. 

More Related Stories