English   

ఈ ఫ్రైడే కూడా క్లియరెన్స్ సేలే నా..?

ra ra movie
2018-02-24 18:29:43

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్స్ అన్నీ కొత్త సినిమా పోస్టర్స్ తో కళకళలాడుతుంటాయి. కానీ ఈ మధ్య ఆ పోస్టర్స్ లో ఉన్న కళ సినిమాల్లో కనిపిచడం లేదు. దీంతో వచ్చిన ప్రతి సినిమా క్లియరెన్స్ సేల్ లా ఉంటోందే తప్ప.,. ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. చిన్న సినిమాలైతే మరీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. గతవారం వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఈ వారం కూడా. ఇవాళ నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ వీటిలో ఏదీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. పైగా మరీ బోరింగ్ సినిమాలుగానూ పేరు తెచ్చుకున్నాయి.

చాలాకాలం తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన సినిమా రా..రా.. ఇవాళ వచ్చింది. తన 125 సినిమాల కెరీర్ లో శ్రీకాంత్ చేసిన మొదటి హారర్ మూవీ ఇది. పేరుకు హారర్ అయినా.. సినిమా చూస్తుంటే కలగాల్సిన భయం చూడ్డానికి కలిగేలా ఉంది. యస్.. ఎప్పుడో విఠాలాచార్య కాలం నాటి దెయ్యాల్నే ఇందులోనూ చూపించడం దర్శకుడు ఎంత అప్డేట్ అయ్యాడనేదానికి నిదర్శనం. కాలానికి అనుగుణంగా మన తెర దెయ్యాలు ఎప్పుడో మారాయి. కానీ ఇతను మాత్రం ఇంకా విఠలాచార్య దగ్గరే ఉండటంతో రారా ఎంత చార్చర్ పెట్టాలో అంతా పెట్టేస్తుంది. 
ఇక లేటెస్ట్ గా ప్రమోషన్స్ తో కాస్త హడావిడీ చేసిన సినిమా జువ్వ. కానీ సినిమాలో అంత సీన్ లేదు. పాతచింతకాయ కథకు పది సినిమాల రిఫరెన్స్ లతో సాగే స్క్రీన్ ప్లేతో సాగిన జువ్వ ఏ సన్నివేశంతోనూ అట్రాక్ట్ చేయలేకపోయింది. ఎక్స్ ప్రెషన్ అంటే ఏంటీ అనేది కూడా తెలియని హీరోను చూస్తే తెలుగు సినిమా స్థాయి ఎలా మారుతుందో అర్థమౌతుంది ఈ జువ్వ సినిమాతో.
ఇక హడావిడీగా రిలీజ్ చేసిన చల్తే చల్తే పరిస్థితి కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా విడుదలైందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇక ఆల్రెడీ తమిళ్ లో యావరేజ్ సినిమా అనిపించుకున్న విక్రమ్ స్కెచ్ కూడా పర్ఫెక్ట్ గా లేదు. విక్రమ్, తమన్నా ఉన్నారన్న క్రేజ్ కూడా లేదీ మూవీకి. కారణం.. ఆల్రెడీ మూవీ రిజల్ట్ తెలిసి ఉండటమే. మొత్తంగా ఇవాళ విడుదలైన నాలుగు సినిమాల్లో ఏదీ ఎంటర్టైన్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఏదేమైనా వచ్చే నెలలో వచ్చే రంగస్థలం వరకూ ఈ క్లియరెన్స్ సేల్ తప్పేలా లేదు..

More Related Stories