English   

టాలీవుడ్ కేరాఫ్ వైజాగ్..?

VIZAG

మారుతోన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మ‌న‌మూ మారాలంటారు. ముఖ్యంగా సినిమాల‌కు సంబంధించి క‌థ‌ల నుంచి స్థ‌లాల వ‌ర‌కూ ఇది వ‌ర్తిస్తుంది. అందుకే ఇప్పుడు మ‌న సినిమా అడ్రెస్ లు మారుతున్నాయి. మొద‌ట్లో మ‌న సినిమా అడ్రెస్ మ‌ద్రాస్. 90ల త‌ర్వాత హైద‌రాబాద్ అయింది. ఇప్పుడు   తెలుగు రాస్ట్రాలే వేర‌య్యాయి. దీంతో ఒక‌ప్పుడు హైద‌రాబాద్ మాత్ర‌మే పెద్ద వేదిక అనుకున్న మ‌న‌వాళ్ల‌కు ఆ రాస్ట్రాన్ని కూడా ఆక‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే ఏ ఈవెంట్ జ‌రిగినా రెండు ప్రాంతాల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌మోష‌న్స్ కోస‌మైతే ఇంక చెప్పక్క‌ర్లేదు. కొన్నాళ్ల క్రితం ఆడియో ఫంక్ష‌న్స్ చేసేవాళ్లు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్స్ మొద‌ల‌య్యాయి. వీటిని ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ప్లాన్ చేయ‌డం ప‌రిపాటి అయింది. ఏ సినిమా ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టిన రెండు ప్రాంతాల‌ను ద్రుష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. కొన్నాళ్ల క్రిత‌మే మొద‌లైన ఈ ట్రెండ్ ఇప్పుడు మ‌స్ట్ గా మారింది.క‌ట్ చేస్తే ఇప్పుడు ఏ గ్రాండ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌న్నా ఛ‌లో వైజాగ్ అంటున్నారు. నిజానికి తెలుగు ప‌రిశ్ర‌మే అక్క‌డికి త‌ర‌లిపోతుంద‌నుకున్నారు చాలామంది. కానీ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇక్క‌డే ఆగిపోయారు. వాస్త‌వానికి వైజాగ్ సినిమా వారికి భారీగా క‌లిసొచ్చేప్లేస్ కాదు. సినిమా ప‌రంగా మాట్లాడితే విజ‌య‌వాడ బెట‌ర్.కానీ ఓ భారీ ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లోనిర్వ‌హించాలంటే చాలా ప్రాబ్ల‌మ్స్ వ‌స్తుంటాయి. సిటీ క్ల‌మ్జీగా ఉండ‌టం దీనికి ఓ కార‌ణం అయితే ప్ర‌తిదానికీ విప‌రీతంగా పెరిగిన ఖ‌ర్చులు మ‌రో రీజ‌న్. అటు గుంటూర్ ప‌రిస్థితీ ఇంతే. ఇప్పుడిప్పుడే అక్క‌డ అన్ని వ‌స‌తులుండేలా డెవ‌ల‌ప్ మెంట్ జ‌రుగుతోంది. కానీ వైజాగ్ క‌ల్చ‌ర‌ల్ సిటీగానూ ప్ర‌సిధ్ధి చెందింది. అందుకే ఇది అన్ని ఫంక్ష‌న్స్ కు అనుకూలంగా ఉండ‌ట‌మే కాదు.. సౌక‌ర్యాల ప‌రంగానూ ది బెస్ట్ గా ఉంటుంది. అందుకే ఏ ఫంక్ష‌న్ కోస‌మైనా ఛ‌లో వైజాగ్ అంటోంది టాలీవుడ్. 

ఇక్క‌డ మ‌రో అంశం కూడా ఉంది.వైజాగ్ లో ఫంక్ష‌న్ చేసి అక్క‌డి నుంచి ప్ర‌తి టౌన్ తిరుగుతూ ప్ర‌మోష‌న్ మొద‌లుపెడితే.. హైదరాబాద్ వ‌చ్చేస‌రికి రాష్ట్ర‌మంతా క‌వ‌ర్ అయిపోతుంది. ఈ ట్రెండ్ కు ఏ సినిమాకూడా మిన‌హాయింపు కాదు. ఒక‌ప్పుడు వైజాగ్, విజ‌య‌వాడ వంటి ప్రాంతాలు.. కేవ‌లం స‌క్సెస్ మీట్ ల‌కు మాత్ర‌మే ప‌రిత‌మైతే ఇప్పుడ‌వి.. ప్ర‌మోష‌న్స్ కీల‌క ప్రాంతాలుగా మారిపోయాయి. మ‌రి ప్ర‌మోష‌న్ చేస్తేనే బిజినెస్ జరిగేది. అందుకే అంద‌రూ ఆంధ్ర‌వైపుఅనివార్యంగా చూడాల్సి వ‌చ్చింది. అది ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ లో ఒక‌భాగం అయింది. స్టార్ హీరో అయినా స్మాల్ హీరో అయినా త‌మ సినిమా రిలీజ్ కు ముందే ఖ‌చ్చితంగా ఒక్క‌సారైనా ఆంధ్ర‌ను చుట్టి రావాల్సిందే. లేదంటే లాసైపోతారు.

More Related Stories