English   

ప్చ్ .. బ్యాడ్ ఫ్రైడే..

awe-talk
2018-02-17 09:17:20

ఫ్రైడే వచ్చిందంటే ఫిల్మీ లవర్స్ కు పండగే. రిలీజ్ అయ్యే సినిమాలతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. గత కొన్నాళ్లు పెద్ద సినిమాలు లేకపోయినా చిన్న సినిమాలే పెద్ద సందడి చేస్తున్నాయి. ఎప్పట్లానే స్మాల్ మూవీస్ బాగా డిజప్పాయింట్ చేస్తున్నాయి. అయితే ఈ ఫ్రైడే మరీ దారుణం. నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏదీ ఆకట్టుకోలేదు. పైగా బోరింగ్ అనే టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా నాని నిర్మించిన అఁ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది వెయిట్ చేసిన ఈ సినిమా బాగా డజప్పాయింట్ చేసింది. ఏ మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో షార్ట్ ఫిలిమ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ కు ఎక్కించారా అన్నట్టుగా మరీ బోరింగ్ మూవీగా మిగిలిపోయింది. భారీ తారగణం ఉన్నా ఆకట్టుకోని కథనం మైనస్ గా అఁ అస్సలు ఎంటర్టైన్ చేయలేకోయింది. 

ఇక సూపర్ స్టార్ మహేష్ అక్క మంజుల మొదటిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన మనసుకు నచ్చింది కూడా అంతే. ఎప్పుడో నువ్వే కావాలి నాటి కథతో( ఇంకా చెబితే అదే కథ)వచ్చిన మనసుకు నచ్చింది సహనానికి పెద్ద పరీక్ష. మంజుల పర్సనల్ ఫీలింగ్స్ ను సిల్వర్ స్క్రీన్ పై పరిచిందా అన్నట్టుగా సా...గే కథనం మరీ ఇబ్బంది పెడుతుంది. పాటలు బావున్నా, సినిమాటోగ్రఫీ అద్భుతం అనిపించినా.. కథేంటో చెప్పకుండా ఫస్ట్ హాఫ్.. కథలోకి వెళ్లాక కథనం బాలేక సెకండ్ హాఫ్ బోరింగ్ సాగాయి. దీంతో మనసుకు నచ్చింది కూడా ఈ ఫ్రైడేను క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది.  సోడా గోలీసోడా అంటూ వచ్చిన చిన్న సినిమా జబర్దస్త్ కామెడీ కంటే తక్కువగా నవ్వించింది. ఇండస్ట్రీలోని స్టార్ కమెడియన్స్ నటించినా నవ్వించడంలో పూర్తిగా విఫలమై నిజంగానే అంతా గ్యాస్ అనిపించుకుంది. ఇక అంతా కొత్తవారితో జగపతిబాబు వాయిస్ ఓవర్ తో వచ్చిన రచయిత  అనే సినిమా వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. మొత్తంగా ఈ ఫ్రైడే ఫిల్మ్ లవర్స్ ను ఎంటర్టైనర్ చేయడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.

More Related Stories