English   

ఈ సంక్రాంతి సూపర్ హిట్టు బాసూ.. డబ్బులే డబ్బులు..

Allu Arjun
2020-01-25 17:15:25

ఈసారి సంక్రాంతి తెలుగు సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో పండగకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా చాలాచోట్ల నాన్ బాహుబలి రికార్డులను కూడా తిరగరాసింది. ఫుల్ రన్ అయిపోయే సరికి అల వైకుంఠపురంలో కచ్చితంగా టాలీవుడ్ టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం అయిపోయింది. రంగస్థలం రికార్డులను కూడా అల్లు అర్జున్ తుడిచి పెట్టేసాడు. ఇప్పటికే ఈ సినిమా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 

ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా వంద కోట్లకు పైగా షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ జోన్ లోకి తీసుకు వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహర్షి 99 కోట్లు వసూలు చేస్తే సరిలేరు నీకెవ్వరు వంద కోట్లకు పైగా తీసుకువచ్చింది. ఈ సినిమాతో వరుసగా ఐదో విజయాన్ని పూర్తిచేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి పెద్ద సినిమాలు 2 డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాతో భారీగా సంపాదించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా అద్భుతంగా ఆడుతుంది. మూడో వారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. 

ఇక ఫ్యామిలీ సినిమా అంటూ వచ్చిన ఎంత మంచివాడవురా డిజాస్టర్ అయిపోయింది. దాంతోపాటు రజనీకాంత్ దర్బార్ సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ రెండు సినిమాలకు థియేటర్స్ కొరత కూడా వచ్చింది. అయితే టాక్ కూడా తేడాగానే రావడంతో సినిమాలు నిలబడలేకపోయాయి. రెండో వారానికే ఈ సినిమాలు థియేటర్స్ లో కనిపించలేదు. అయితే సరిలేరు నీకెవ్వరుతో పాటు అల వైకుంఠపురములో సినిమాలు మాత్రం మూడో వారంలో కూడా సత్తా చూపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిని అద్భుతంగా మొదలుపెట్టాయి. 

More Related Stories