English   

హీరోయిన్స్ రెమ్యునరేషన్ లిస్ట్...మరీ అంతా ?

Tollywood
2019-05-21 10:28:03

తెలుగులో ఒకప్పుడు హీరోలకి సమానంగా కూడా హీరోయిన్లు అందుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అలా అని వారు ఏమీ తక్కువ కాదు. తాజా గా టాలీవుడ్ హీరోయిన్స్ తాజా రెమ్యునరేషన్ లిస్ట్‌పై ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చగా జరుగుతోంది. టాలీవుడ్ హీరోయిన్లు పుచ్చుకున్న, పుచ్చుకుంటున్న పారితోషికాల మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా రెమ్యునరేషన్ పుచ్చుకునే మొదటి హీరోయిన్‌గా అనుష్కనే చెప్తున్నారు. రెండో స్థానంలో నయనతార నిలిచింది. అనుష్క ఒక్కో సినిమాకు సుమారు 3.5 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందని, హీరోయిన్ నయనతార కూడా ఒక్క సినిమాకు సైన్ చేస్తే సుమారు రెండున్నర నుంచి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం. ఇక పెళ్ళైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్లు. ఎన్ని సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేని పూజా హెగ్దే ఒక్కో సినిమాకి దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వరకు అందుకునుందట. ఇక అలాగే సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాకు కోటిన్నర వరకు చార్జ్ చేస్తుందని సమాచారం. ఇక చాన్నాళ్ళ తర్వాత ఎఫ్ 2 తో హిట్ కొట్టిన తమన్నా విషయానికొస్తే.. సినిమాకు కోటి 20 లక్షలు తీసుకుంటుందని టాక్. ఇక తాజాగా రెండు సినిమాలు చేసిన కైరా అద్వానీ, సక్సెస్ లు లేని రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా సినిమాకు దాదాపు కోటి వరకు తీసుకుంటున్నారట. నిజానికి ఈ రేంజ్ రేమ్యునరేషన్ లు చిన్న హీరోలకి కూడా లేవంటే ఆశ్చర్యపోక తప్పదు.

More Related Stories