English   

ఇప్పుడు కానీ దాస‌రి ఉండుంటేనా..? 

dasari-tollywood
2018-04-18 16:04:10

ఉన్న‌పుడు వాళ్ల విలువ తెలియ‌దు పోయాక త‌ప్ప అంటారు. కానీ దాస‌రి ఉన్న‌పుడు ఆయ‌న విలువ తెలుసు.. పోయాక ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ‌కు ఎవ‌రూ నోరు మెద‌ప‌కుండా కామ్ గా ఉన్నారు. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రువు మొత్తం గంగ‌లో క‌లిసిపోతున్నా కూడా ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. శ్రీ‌రెడ్డి ఇష్యూ నెల రోజులుగా న‌లుగుతున్నా.. ఆమె ఇండ‌స్ట్రీ మొత్తాన్ని దోషులుగా చిత్రీక రిస్తున్నా కూడా ఎవ‌రూ ఆమెను ఆప‌డం లేదు. ఎవ‌రూ ఏం అన‌క‌పోవ‌డంతో ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉంది ఈమె. అస‌లు ఈమెకు స‌మాధానం చెప్పే పెద్ద మ‌నుషులే ఇండ‌స్ట్రీలో క‌రువ‌య్యార‌ని ఇప్పుడిప్పుడే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు కానీ దాస‌రి నారాయ‌ణ‌రావు ఉండుంటేనా.. అస‌లు ఈ స‌మ‌స్య ఇంత‌దూరం వ‌చ్చేది కాదంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఆయ‌న దాన్ని మొగ్గ‌లోనే తుంచేసేవార‌ని చెబుతున్నారు. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. దాస‌రి ఉన్న‌పుడు ఆయ‌న ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక‌టిగా నిలిచిపోయేది. కానీ ఇప్పుడు దాస‌రి లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది మ‌న ఇండ‌స్ట్రీలో. ఇదే మాట తాజాగా జీవిత కూడా చెప్పింది. దాస‌రి గారు ఉండుంటే ఈ రోజు ఇండ‌స్ట్రీకి ఈ గ‌తి ప‌ట్టేది కాద‌ని..! ఆమె మాత్ర‌మే కాదు ఇండ‌స్ట్రీలో ఇంకా చాలామంది అభిప్రాయం కూడా ఇదే. మొత్తానికి ఆయ‌న పోయి ఏడాది కావొస్తున్నా ఇప్ప‌టికీ ఆ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. 

More Related Stories