English   

టాలీవుడ్ నెక్ట్స్ నెం.1 ప్ర‌భాస్.. 

Prabhas Chiru TollywoodNo1
2017-05-01 06:34:37

బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్. ఇప్పుడు బాహుబ‌లి 2తో ఆ జోరు మ‌రింత‌గా పెరిగిపోయింది. బాహుబ‌లి హిట్ క్రెడిట్ రాజ‌మౌళి ఖాతాలోకి వెళ్తే.. పార్ట్ 2లో ప్ర‌భాస్ కూడా భాగం తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో ఈయ‌న గురించి కూడా చ‌ర్చ బాగానే న‌డుస్తుంది. ప్ర‌స్తుతం సుజీత్ తో సాహో సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్. మ‌రి బాహుబ‌లి త‌ర్వాత సినిమా అంటే అదే రేంజ్ లో ఉండాలి క‌దా.. అందుకే సుజీత్ సినిమాను సైతం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు నిర్మాత‌లు. ప్ర‌భాస్ త‌ర్వాతి సినిమాను ఏకంగా 150 కోట్ల‌తో నిర్మించ‌బోతున్నారు యువీ క్రియేష‌న్స్ సంస్థ‌. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచేయాల‌ని ఫిక్సైపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్.

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌బోయే ఈ సినిమా తెలుగు, త‌మిళ్ తో పాటు హిందీలో తెర‌కెక్క‌నుంది. సుజీత్ కూడా నార్మ‌ల్ సినిమానేం చేయ‌ట్లేదు. ఇది కూడా భాష‌తో ప‌ని లేని ఐడియా అని తెలుస్తోంది. ఇండియ‌న్ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు రాని యాక్ష‌న్ పార్ట్ ను ఈ సినిమాలో చూపించ‌డానికి ట్రై చేస్తున్నాడు సుజీత్. ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఏకంగా 35 కోట్లు ఖర్చు చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాకు టెక్నిక‌ల్ టీం కూడా భారీగానే ఉంది. స‌బు స‌రిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ గా ఉండ‌గా.. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బేట్స్ ను తీసుకొస్తున్నారు. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టులు వివేక్ ఒబేరాయ్, జాకీష్రాఫ్ ఈ సినిమాలో విల‌న్లుగా న‌టించ‌నున్నారు. మొత్తానికి సాహో హిట్టైతే టాలీవుడ్ లో చిరంజీవి త‌ర్వాత అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ గా ప్ర‌భాస్ ఎదిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

More Related Stories