English   

మళ్లీ మొదలైన సినిమా సందడి..హైదరాబాద్ లో షూటింగ్ లు షురూ

 Tollywood
2021-06-18 12:36:16

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడంతో మ‌ళ్లీ న‌గ‌రంలో షూటింగ్ ల జోరు మొద‌లైంది. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వ‌ర‌కూ అన్ని సినిమాలు షూటింగ్ ల‌ను ప్రారంభించాయి. ఇక ఇప్పుడు న‌గ‌రంలో ఏ సినిమా ఎక్క‌డ షూటింగ్ జ‌రుపుకుంటుంది అన్న వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ గండిపేట లో జరుగుతుంది. అంతే కాకుండా ఆచార్య సినిమా షూటింగ్ కోకాపేటలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. 

నాని శ్యామ్ సింగారాయ్ సీబీఐటీ కాలేజ్ పరిసర ప్రాంతంలో వేసిన సెట్ లో జరుగుతుంది. నాగ చైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో జరుగుతుంది. నితిన్ మాస్ట్రో సినిమా షూటింగ్ ఎర్రమంజిల్ లో జరుగుతుంది. పుష్ప షూటింగ్ ..ఈనెల 28 నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగనుంది. అంతే కాకుండా బాల‌య్య అఖండ జూలై ఒకటి నుంచి గండిపేట లో 40రోజులకు గానూ ప్ర‌ణాళిక‌ను వేసుకున్నారు. 

విశాల్ హీరోగా న‌టిస్తున్న ఓ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అంతే కాకుండా వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న ఎఫ్-3 సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. మ‌రోవైపు మహేష్ సర్కార్ వారి పాట జూలై ఐయిదు నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. ఇక ఇందులో చాలా సినిమాలు షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. 
 

More Related Stories