English   

 టాలీవుడ్ సమ్మర్ రివ్యూ..  

Tollywood
2018-05-16 19:20:10

టాలీవుడ్లో ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి.. పడుతున్నాయి. రంగస్థలంతో మొదలైన సమ్మర్ హంగామా ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆల్ మోస్ట్ పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. ఈ సీజన్లో ఇక మిగిలింది రెండు మూడు వారాలు మాత్రమే. ఈ టైమ్ లో ముఖ్యంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి.  టాలీవుడ్ కు ఈ ఏడాది సమ్మర్ సీజన్ బాగానే కలిసొచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలంతో మొదలైన సమ్మర్ హంగామా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతోంది. రంగస్థలం యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఎవ్వరూ ఊహించని విధంగా 200ల కోట్ల క్లబ్ లో చేరింది. బాహుబలి చిత్రాల తర్వాత 200ల కోట్లు సాధించిన మూవీగా రంగస్థలం రికార్డ్ సృష్టించింది. అన్నింటికి మించి రామ్ చరణ్ ఈ మూవీతో యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. 

ఇక రంగస్థలం తర్వాత వచ్చిన చల్ మోహన్ రంగ, కృష్ణార్జునయుద్దం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే ఏప్రిల్ 20న వచ్చిన భరత్ అనే నేను మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హిట్ కళ తెచ్చింది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి, మహేష్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. భరత్ అనే నేను వచ్చిన వన్ వీక్ కి, ఆచారి అమెరికా యూత్ర మూవీ వచ్చి ఫెయిల్ అయ్యింది. ఇక మే 4న వచ్చిన మరో పెద్ద సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అల్లు అర్జున్ నటించిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కాస్త మిక్సుడ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్లు రాలేదు. ఫైనల్ గా ఏ స్థాయి హిట్ గా ఈ సినిమా నిలుస్తుందో చూడాలి. 

సమ్మర్ సీజన్లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మహానటి. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ, టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మహానటి ఈ సమ్మర్ లో మంచి హిట్ గా నిలవబోతుంది. ఇక ఈ నెల 11న పూరీ జగన్నాథ్ తీసిన మెహబూబా వచ్చింది. ఈ సినిమాకి కూడా మిక్సుడ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఇక సమ్మర్ సీజన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులే టైమ్ ఉంది. అంటే ఈ నెలలో ఇంక రెండు శుక్రవారాలే సినిమాలు రిలీజ్ చేయడానికి కరెక్ట్ టైమ్. ఈ వీక్ లో వస్తాడనుకున్న విశాల్ అభిమన్యుడు వాయిదా పడింది. అయితే విజయ్ ఆంటోని నటించిన కాశీ మాత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఇక శుక్రవారం ఆర్.నారాయణ మూర్తి అన్నదాత సుఖీభవ అంటూ వస్తున్నాడు. వీటిపై అంతగా అంచనాలు లేవు. అయితే ఈ నెల 25న రెండు క్రేజీ చిత్రాలు బరిలో దిగుతున్నాయి. అవే నేలటిక్కెట్, నా నువ్వే...

ఈ నెల 25నే వస్తున్న రెండు సినిమాల్లో నా నువ్వేపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమా ఇది. ప్రేమకథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నా. కళ్యాణ్ రామ్, తమన్నా కాంబినేష్నలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇవాళే టీజర్, పాటలతో ఎట్రాక్ట్ చేసిన టీమ్, ఇప్పుడు ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది టీమ్. ఇందులో కళ్యాణ్ రామ్ న్యూ లుక్ లో కనిపిస్తుంటే, తమన్నా బ్యూటిఫుల్ గా ఉంది.

ఇక 25నే మాస్ మహారాజ్ రవితేజ నటించిన నేలటిక్కెట్ వస్తోంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలే తీసిన ఈ డైరెక్టర్, నేలటిక్కెట్ టీజర్స్ అండ్ సాంగ్స్ చూశాక ఫస్ట్ టైమ్ మాస్ బాట పట్టాడనిపిస్తోంది. మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఇదే రోజు రావాల్సిన నాగార్జున ఆఫీసర్ మూవీ జూన్ ఫస్ట్ కి పోస్ట్ పోన్ అయ్యింది, అయితే అదే రోజున రాజ్ తరుణ్ రాజుగాడు మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. మిగిలిన ఈ రెండు మూడు వారాల్లో ఎన్ని సినిమాలు, ఈ సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకుంటాయో చూడాలి. 

More Related Stories