English   

కామెడీ చేస్తూనే విలన్ అవతారం

Tollywood's Most Wanted Comedian Vennela Kishore
2018-08-04 10:16:13

డిఫెరెంట్ మాడ్యులేష‌న్.. మొహంలోనే క‌నిపించే ఫ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్స్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో విచిత్ర‌మైన ఇంగ్లీష్ ప‌దాలు.. అద్భుత‌మైన కామెడీ టైమింగ్.. ఇవ‌న్నీ వెన్నెల కిషోర్ సొంతం. అప్పుడెప్పుడో వెన్నెల సినిమాతో ప‌రిచ‌యం అయిన కిషోర్.. ఆ త‌ర్వాత స్టార్ క‌మెడియ‌న్ గా మార‌డానికి చాలా టైమ్ ప‌ట్టింది. సునీల్ హీరోగా మార‌డం మ‌నోడికి హెల్ప్ అయింది. బిందాస్ లాంటి సినిమాల్లో బాగా న‌వ్వించి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ క‌మెడియ‌న్ టైమ్ మొద‌లైంది. టాలీవుడ్ లో ఎవ‌రి టైమ్ ఎప్పుడు వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు 30 ఇయ‌ర్స్ పృథ్వీ టైమ్ న‌డిచింది. ఇప్పుడు వెన్నెల టైమ్ మొద‌లైంది.

ఇప్పుడు ఏ తెలుగు సినిమాలో చూసినా వెన్నెల కిషోర్ ఉండాల్సిందే. ఆయ‌న కోస‌మే క్యారెక్ట‌ర్లు రాస్తున్నారు ద‌ర్శ‌కులు. ఈయ‌న కూడా అదే రేంజ్ లో ఆ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఈయ‌న లేకుండా సినిమా చేయ‌డ‌మే మానేసారు ద‌ర్శ‌కులు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ క‌చ్చితంగా ఉండాల్సిందే. లేక‌పోతే కామెడీ పండ‌ట్లేదు. పైగా వెన్నెల కిషోర్ కూడా రొటీన్ కామెడీతో కాకుండా కాస్త కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. ఈ వారం విడుద‌లైన గూఢ‌చారి.. చిల‌సౌల‌లో వెన్నెల కిషోర్ పాత్ర‌లు సూప‌ర్ గా పేలాయి. చిల‌సౌలో క‌మెడియ‌న్ గా క‌డుపులు చెక్క‌లు చేస్తే.. గూఢ‌చారిలో న‌వ్వులు పూయిస్తూనే చివ‌ర్లో విల‌న్ గా ట్విస్ట్ ఇచ్చాడు వెన్నెల‌. ఈ పాత్ర క‌చ్చితంగా వెన్నెల కిషోర్ కెరీర్ లో గుర్తుండి పోతుంది.

ఈ మ‌ధ్య విడుద‌లైన చాలా సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా గ‌తేడాది విడుద‌లైన రారండోయ్ వేడుక చూద్దాం.. ఆనందో బ్ర‌హ్మ‌లో వెన్నెల బాగానే కురిసింది. అంతేకాదు స్టార్ హీరోలంద‌రికీ వెన్నెల కిషోర్ మోస్ట్ వాంటెడ్. దాంతో ద‌ర్శ‌కులు కూడా ఈయ‌న కోసం చూస్తున్నారు. ఈయ‌న దెబ్బ‌కు అంతో ఇంతో ఉన్న బ్ర‌హ్మానందం పూర్తిగా ఖాళీ అయిపోయాడు. మొత్తానికి టైమ్ అంటే ఇదే క‌దా..! కిషోర్ కెరీర్ లో వెన్నెల వెలిగిపోతుందిప్పుడు.

More Related Stories