English   

కుమిలిపోతున్న అగ్ర హీరో..

2017-04-01 07:42:05

ఆయ‌న ఇండ‌స్ట్రీలో ఓ అగ్ర హీరో.. 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు.. న‌టుడిగా, నిర్మాత‌గా ఎన్నో సినిమాలు చేసారు. డైలాగులు చెప్ప‌డంలో ఇప్పుడున్న హీరోల్లో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా..! స్వ‌యానా అన్న నంద‌మూరి తార‌క‌రామారావు గారితో ఆయ‌న‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. కానీ ఎన్ని వంద‌ల సినిమాలు చేసినా.. ఎన్ని సినిమాలు నిర్మించినా.. ఒక్క లోటు మాత్రం ఆ అగ్ర హీరోను ఇంకా వేధిస్తూనే ఉంది. అదే కుమారుల వైఫ‌ల్యం. అవును.. ఆయ‌న ఇద్ద‌రు కొడుకులు ఇండ‌స్ట్రీకి ఒకేసారి వ‌చ్చారు. వ‌చ్చి ద‌శాబ్ధం దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయారు. వాళ్ల సినిమాలు వ‌స్తున్నాయంటే బ‌య్య‌ర్లు కొన‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. చివ‌రికి బ‌య‌టి నిర్మాత‌లు ధైర్యం చేయ‌క‌పోవ‌డంతో త‌న ఆస్తుల్నే కొడుకులకు ధార‌పోస్తున్నాడు ఆ అగ్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా కొట్ట‌లేని త‌న కుమారుల‌ని చూసి కుమిలిపోతున్నాడు స‌ద‌రు హీరో. మ‌రోవైపు త‌న స్నేహితుల కుమారులు సూప‌ర్ స్టార్స్ గా వెలిగిపోతుంటే చూసి ఏడుస్తున్నాడు ఆయ‌న‌. ఆ అగ్ర హీరో ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది క‌దా..! ఆయ‌నకు ఈ స‌న్ స్ట్రోక్ ఎప్పుడు త‌గ్గేనో..?

More Related Stories