English   

ఆ ఇద్దరి హీరోల మధ్య ఆర్టిఫిషియల్ ఫ్యాన్స్ వార్

Top Heros.jpg
2020-02-25 11:12:29

టాలీవుడ్ లో హీరోల మధ్య కోల్డ్ వార్స్ మామూలే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న కోల్డ్ వార్స్ మాత్రం రచ్చ లేపుతున్నాయి. మొన్న సంక్రాంతి రిలీజ్ సమయానికి ఇద్దరు అగ్రహీరోలు ఒక రేంజ్ లో రచ్చ చేయగా ఇప్పుడు మరో కుర్ర హీరోలిద్దరూ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. నిజానికి టాలీవుడ్ లో వీరిద్దరూ మీడియం రేంజ్ హీరోలే, అయితే ఇద్దరూ ఓకే సినిమాతో స్టార్ అనిపించుకున్న్న వారే.

ఒకరేమో వరస విజయాలతో స్టార్ కాగా ఈమధ్య ఫ్లాపుల బాట పట్టాడు. మరొకరేమో చేసింది రెండు మూడు సినిమాలే కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్టుగా క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ రెండో హీరో ఆగమనంతో ముందున్న హీరోల్లో టాప్ అనిపించుకున్న హీరో ప్లేస్ కి దెబ్బ పడింది. దీంతో ఈ ఇద్దరు పైకి స్నేహితులుగా కవరింగ్ ఇస్తున్నా ఫ్యాన్స్ చేత కోల్డ్ వార్ ప్రోత్సహిస్తున్నారట.

ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా లేని ఇద్దరూ బయట మాత్రం లేనిపోని హైప్ సృష్టించి మరీ తన్నుకున్తున్నారట. పెద్ద ఫ్యాన్స్ లేని ఇద్దరూ ఫ్యాన్ వార్స్ అంటూ కృత్రిమంగా సృష్టించి మరీ హడావుడి చేయిస్తున్నారని టాక్.

More Related Stories