English   

 పూరీకి ఇది ట‌ఫ్ టైమ్

Puri-Jagannadh

ప్ర‌స్తుతం మా నాన్న‌ను స్టార్ హీరోలెవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే డైరెక్ట‌ర్ గా మా నాన్న‌ను నేనే రీ లాంచ్  చేయ‌బోతున్నాను..  కొన్నాళ్ల క్రితం పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరీ చెప్పిన మాట‌లివి. నిజ‌మే.. పూరీని ఇప్పుడు స్టార్స్ ఎవ‌రూ పట్టించుకో్వ‌డం లేదు. అలాగ‌ని కొడుకు రీ లాంచ్ చేయ‌డానికి ఇత‌నూ స్టార్ కాదు. సరిగ్గా ఇదే పాయింట్ తో బ‌య్య‌ర్స్ కూడా క‌ర‌వ‌య్యారా మూవీకి. ఫైన‌ల్ గా దిల్ రాజును ఒప్పించి  దిల్ రాజు విడుద‌ల చేస్తోన్న సినిమా అనే ట్యాగ్ తో త‌న లేటెస్ట్ మూవీ మెహ‌బూబా విడుద‌ల చేసుకుంటున్నాడు పూరీ జగ‌న్నాథ్. ఆకాశ్ పూరీ, నేహా శెట్టి జంట‌గా న‌టించిన ఈ సినిమా రేపు విడుద‌ల కాబోతోంది. అంటే మ‌రికొన్ని గంట‌ల్లో పూరీతో పాటు ఆకాశ్  ఫ్యూచ‌ర్  కూడా తేలిపోతుంద‌న్న‌మాట‌. నిజానికి ఈ సినిమా ట్రైల‌ర్ బావుంది. పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌మోష‌న్స్ కూడా బానే చేస్తున్నారు. అయినా రావాల్సినంత క్రేజ్ రాలేద‌నేదీ నిజం. చేయ‌డానికి దిల్ రాజు విడుద‌ల చేస్తున్నా.. ఆయ‌నా ఆ త‌ర్వాత ఎక్క‌డా ఈ సినిమా గురించి ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా విడుద‌ల అన్న టైమ్ లో ఇప్పుడు మెహ‌బూబాబ‌కు మ‌హాన‌టి గ‌ట్టి షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఈ బుధ‌వారం విడుద‌లైన మ‌హాన‌టి సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది కొంత వ‌ర‌కూ మెహ‌బూబాకు ప్ర‌తికూలాంశం. పూరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేవాళ్లు కూడా ఆయ‌న రొటీన్ మాఫియా క‌థ‌ల‌కు విసిగిపోయారు. ఇప్పుడు త‌న‌యుడి సినిమా కాబ‌ట్టి ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకునే ఉంటాడు అనుకున్నా.. అనుకోని అవాంత‌రంగా వ‌చ్చింది మ‌హాన‌టి. ఇండ‌స్ట్రీ అంతా ముక్త కంఠంతో మహాన‌టిని కీర్తిస్తున్నారు. విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు ఆ సినిమాకు ఓటేస్తున్నారు. మ‌రి ఈ టైమ్ లో వ‌స్తోంది కాబ‌ట్టి మెహ‌బూబా ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories