English   

బికినీ బేబీ మ‌న‌సుకు న‌చ్చింది.. 

Tridha-Choudhury
2018-05-20 15:59:31

ఈ మ‌ధ్య బాలీవుడ్ హీరోయిన్ల‌కు అస్స‌లు మొహ‌మాటం అనే ప‌దానికి అర్థ‌మే తెలియ‌కుండా పోతుంది. అడిగినంత అందాలు అలా ధార‌బోస్తూ పిచ్చెక్కిస్తున్నారంతే. ఇప్పుడు కూడా త్రిదాచౌద‌రి ఇదే చేసింది. ఈ భామ‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం కూడా అక్క‌ర్లేదు. ఆ మ‌ధ్య నిఖిల్ సూర్య వ‌ర్సెస్ సూర్య‌లో న‌టించింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే మ‌న‌సుకు న‌చ్చిందిలో సెకండ్ లీడ్ చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ అందాల ఆర‌బోత ఓ రేంజ్ లో చేసింది త్రిదా. ఇక మ‌న‌సుకు న‌చ్చిందిలో అయితే బికినీల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు దాంతో త్రిదాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ త‌న‌ను ప‌ట్టించుకునే వ‌ర‌కు.. ద‌ర్శక నిర్మాత‌ల దృష్టిలో ప‌డేవ‌ర‌కు ఏదో చేసేలా ఉంది త్రిదా. తాజాగా మ‌రోసారి హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు బీచ్ లో అమ్మాయిగారు చేసిన ర‌చ్చ‌కు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అంత‌గా అందాల‌న్నీ ఒల‌క‌బోసే స్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు త్రిదాకు ఆఫ‌ర్ ఇవ్వ‌క‌పోరూ..!

More Related Stories