English   

మోహినీ దెయ్యంగా త్రిష

Trisha-Krishnan
2018-07-16 17:51:43

త్రిష.. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి రెండు దశాబ్ధాలు కావొస్తోంది. అయినా అదే గ్లామర్, అదే ఫిజిక్ మెయిన్టేన్ చేస్తూ ఇంకా కొత్త సినిమాలు అందిపుచ్చుకుంటోంది. తెలుగులో తను చేసిన చివరి సినిమా లయన్. తర్వాత చీకటి రాజ్యం అనే సినిమాలోనూ కనిపించింది. కానీ తను మెయిన్ హీరోయిన్ గా తనదైన గ్లమరస్ పాత్రల్లో కనిపించడం తెలుగులో మానేసింది. కానీ తమిళ్ లో ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యే మళయాలంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై సోయగం చేతిలో ఇప్పుడు ఏకంగా ఆరు సినిమాలున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇవి కాక ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా మోహిని.. 

త్రిష కొత్త సినిమా మోహిని. తమిళ్ లో రూపొందిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో అమ్మడు మోహిని దెయ్యంగా కనిపించబోతోంది. త్రిష లాంటి బ్యూటీ దెయ్యంగా కనిపిస్తేచూస్తారా అనేది తర్వాతి విషయం. కానీ లేటెస్ట్ గా ఈ మోహిని ట్రైలర్ విడుదలైంది. ఏమాటకామాటే.. అబ్బో త్రిష గ్లామర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అదే ఫిజిక్. అదే గ్రేస్. అటు సీరియస్ గా ఉంటూనే ఇటు గ్లామర్ నూ కురిపిస్తోంది. కాకపోతే రొటీన్ రివెంజ్ డ్రామాలానే కనిపిస్తోంది ఈ మోహిని. కాకపోతే నీళ్లతో ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. అందుకే ఆ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే గ్రాఫిక్స్ కూడా చేశారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. ఈ గ్రాఫిక్స్ కోసమే ఇంత లేట్ అయింది. ఇక త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ మూవీతో తెలుగులో మళ్లీ ఆడియన్స్ ఈ డస్కీ బ్యూటీని పట్టించుకుంటారా అనేది చూడాలి. 

More Related Stories