English   

త్రిష కోరిక ఇప్పటికి తీరింది

Trisha Krishnan Dream Comes True
2018-08-21 20:14:42

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏజ్ బార్ అవుతున్నా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలు పోతున్నా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రజినీ నుంచి సినిమా అంటే ఆ బిజినెస్ క్రేజ్ కూడా ఇప్పటికీ అలాగే ఉండటం విశేషం. రీసెంట్ గా వచ్చిన కాలా తేడా కొట్టినా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సినిమాకు వెంటనే కమిట్ అయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటి వరకూ స్టార్స్ ను హ్యాండిల్ చేయలేదు. అయినా అతని కథకు ఫిదా అయ్యాడు సూపర్ స్టార్. డిఫరెంట్ అండ్ టాలెంటెడ్ స్టార్ కాస్ట్ తో వస్తోన్న ఈమూవీలో త్రిష కూడా నటిస్తోంది.

రజినీకాంత్ తో నటించాలనేది త్రిష 15యేళ్ల కోరికట. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది అని చాలా హ్యాపీగా చెబుతోందీ డస్కీ బ్యూటీ. ఆ ఆనందాన్ని రజినీతో కలిసి చేసిన ఓ ఫోటోతో కలిపి పంచుకుంది. అన్నట్టు ఈ స్టిల్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. అటు రజినీ కూడా మరింత యంగ్ గా కనిపిస్తుంటే.. పదిహేనేళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఎంత ఫిట్ గా ఉందో త్రిష ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది. ఇక ఈసినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ తో పాటు నిన్నటి అందాల తార సిమ్రన్ కూడా విలన్ గానే కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుండటం విశేషం.. మొత్తంగా పదిహేనేళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందని త్రిష తెగ హ్యాపీగా ఫీలవుతోంది.

More Related Stories