English   

మ‌ళ్లీ అజ్ఞాత‌వాసేనా త్రివిక్ర‌మ్ గారు..? 

Trivikram-Aravindha-Sametha
2018-05-21 13:48:26

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌కు ఓ ఐడియా ఉంటుంది. ఈయ‌న సినిమా ఇలా ఉంటుంద‌ని..! కానీ ఇప్పుడు ఆ ఐడియాను మొత్తం మార్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకుంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈయ‌న‌కు అది కొత్త ఐడియా కానీ ఇండ‌స్ట్రీకి కాదు..! ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో ఫ్యాక్ష‌న్ డ్రామాలు వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఓ ట్రెండ్ న‌డిచింది కూడా. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఎన్టీఆర్ సినిమాతో సీమ నేప‌థ్యం క‌థ‌ను తీసుకొస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. టైటిల్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అంటూ పౌరుషం ఉట్టిప‌డేలా పెట్టాడు త్రివిక్ర‌మ్. కానీ అది అర్థం అవుతుందా అనేది అస‌లు అనుమానం. అ అక్ష‌రంతో అత‌డు.. అత్తారింటికి దారేది.. అ..ఆ.. అజ్ఞాత‌వాసి త‌ర్వాత మ‌రోసారి అలాంటి టైటిల్ పెట్టాడు  త్రివిక్ర‌మ్. అయితే ఈ టైటిల్ ఫాంట్ కూడా చూడ్డానికి అజ్ఞాత‌వాసికి చేరువ‌గా ఉంది. ఆ టైటిల్ కాదు.. లోగో కూడా క‌లిసిరాలేదు. మ‌రి ఇప్పుడు ఎన్టీఆర్ తోనూ ఇదే చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. అస‌లే ఇప్పుడు ఫ్లాప్ ఇచ్చిన క‌ష్టాల్లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలాంటి టైమ్ లో ఆయ‌న నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుందో.. ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories