English   

పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ కు అన్ని కోట్లు ఇస్తున్నారా..

Trivikram
2021-01-19 13:52:22

దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆయనతో పని చేయడానికి స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. నీళ్లు తాగినంత ఈజీగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ ఉంటాడు మాటల మాంత్రికుడు. అలాంటి దర్శకుడితో పని చేయాలని ఏ హీరో మాత్రం కోరుకోడు.. అంత మార్కెట్ ఉన్న దర్శకుడు తన స్థాయిని తగ్గించుకుని మరో దర్శకుడు సినిమాకు స్క్రీన్ ప్లే-మాటలు రాయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు త్రివిక్రమ్. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం తన స్థాయిని తగ్గించుకుని మరి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నాడు. 

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది. ఇదిలా ఉంటే ఎలాంటి అనుభవం లేని ఒక కుర్ర దర్శకుడిని నమ్మి పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఎలా చేస్తున్నాడు అని ముందు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ దీని వెనక త్రివిక్రమ్ హస్తం ఉంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు  త్రివిక్రమ్ అందిస్తున్నాడు. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే.

ఆయన ఉన్నాడని ధైర్యంతోనే పవన్ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ కథ పవన్ కళ్యాణ్ కు సూట్ అవుతుందని చెప్పింది కూడా త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పని చేయడానికి ఏకంగా పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈయన ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి దాదాపు 20 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు కేవలం స్క్రీన్ ప్లే, మాటలు రాయడానికి అందులో సగం పారితోషికంగా అందుకుంటున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ రాకతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. 

More Related Stories