English   

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కు చెడిందా..?

Trivikram-pawan

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. నితిన్ సినిమా ఛల్ మోహన్ రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్రివిక్రమ్ ఎందుకు రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడనే అంటున్నారు. పవన్ వస్తే త్రివిక్రమ్ కు ప్రాబ్లమ్ ఏంటీ..? ఇదో పెద్ద టాపిక్ అయిపోయిందిపుడు. పోనీ త్రివిక్రమ్ ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నాడనుకోవడానికీ లేదు. ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్  కూడా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. అయినా రాలేదంటే కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఓ కారణం అని వినిపిస్తోంది. అజ్ఙాతవాసితో పవన్ కళ్యాణ్ 25వ సినిమాను బిగ్గెస్ట్ డిజాస్టర్ చేశాడు త్రివిక్రమ్. ఈ కోపం అభిమానుల్లో చాలా ఉంది. తాను అక్కడికి వస్తే ఏం మాట్లాడితే ఎవరెలా రియాక్ట్ అవుతారో అనే భయం త్రివిక్రమ్ లో ఉందని.. ఆ కారణంగానే అతను రాలేదంటున్నారు చాలామంది. 

మరోవైపు అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల మధ్య సఖ్యత చెడిందనే రూమరూ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను నిర్మాతలకు ఇవ్వడానికి నో చెప్పాడు. కానీ త్రివిక్రమ్ చాలా వరకూ ఇచ్చాడు. ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య తేడాలొచ్చాయని వినిపిస్తోంది. అలాగే అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ మెంటల్ గా చాలా డిస్ట్రబ్ అయ్యాడని.. అప్పటి నుంచీ పవన్ ను కలవడానికి ఇష్టపడడం లేదనీ.. ఛల్ మోహన్ రంగా ఫంక్షన్ కు వస్తే మళ్లీ ఆయన ఫేస్ చూడాల్సి వస్తుందనే ఈ ఫంక్షన్ కు తన మొహం చాటేశాడు అనేవారూ ఉన్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ రాకపోవడానికి అసలు కారణాలేంటో కానీ.. ఈ కొసరు వార్తలు మాత్రం టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే పవన్, త్రివిక్రమ్ ల మధ్య తేడాలొచ్చాయా..? ఇద్దరికీ చెడిందా..? ఏమో.. దీనికి టైమే సమాధానం చెబుతుంది.

More Related Stories