English   

ఎన్టీఆర్ ని వదిలేసి పవన్ వద్దకు త్రివిక్రమ్ 

ntr pawan
2020-02-19 11:32:41

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా అని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా రాజమౌళి సినిమా వాయిదా వేయడంతో ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ని బయటకు ఎప్పుడు పంపుతారో తెలియని పరిస్థితి. ఇక మరో పక్క త్రివిక్రమ్ ఏమో ఖాళీ ! మొన్ననే హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న ఆయన ఖాళీగా ఉండలేదు కదా అందుకే మరో ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

అదేంటంటే ఆయన పవన్ కి ఒక కధ చెప్పి ఒప్పించి సినిమా తీసే పనిలో ఉన్నాడట. నిజానికి పవన్, త్రివిక్రమ్ లు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. 'జల్సా'తో మొదలైన వీరి ప్రయాణం అజ్ఞాతవాసి దెబ్బ తర్వత కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ కాగా, 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన 'అజ్ఞాతవాసి' మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. 

ఈ సినిమా తరువాత పవన్ రాజకీయాలలో తలమునకలు కాగా త్రివిక్రమ్ ఏమో ఎన్టీఆర్ తో అరబింద సమేత, అల్లు అర్జున్ తో అల వైకుంటపురంలో చేసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నా ఆ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉండడంతో పవన్ ని ఒప్పించి ఆయనతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ 'పింక్' రీమేక్, క్రిష్ సినిమాలు సమాంతరంగా చేస్తున్నాడు. వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా ప్రకటించారు. మరి త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉండదనుందో ? 

More Related Stories