English   

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. 

trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న అరవింద సమేత వీరరాఘవ విడుదల డేట్ అనౌన్స్ అయింది. ముందు నుంచీ చెబుతున్నట్టు దసరా బరిలోనే ఉన్నా.. ఆ సంబరాల్ని ఓ వారం ముందుగానే తెస్తున్నారు. అక్టోబర్ 19న దసరా. వీళ్లు ఒక వారం ముందుగానే అక్టోబర్ 11నే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇది మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు. సినిమాకు గ్రాండ్ గా ఓపెనింగ్స్ వస్తాయి. హిట్ టాక్ వస్తే సెలవులు మొత్తం సందడి చేస్తుంది. ఇక పండగ ఆప్షన్ గా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కాకుండా ఉంటుందా..? అందుకే  ఆ టైమ్ లో ఎన్ని సినమాలు వచ్చినా.. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాదే పై చేయి అవుతుంది. అందుకే ఇలా ఒక వారం ముందు నుంచే ఎన్టీఆర్ అభిమానుల్లో సందడి స్టార్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హారిక, హాసిని బ్యానర్ లో ఎన్టీఆర్ చేయడం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్. 

ఇక అరవింద సమేతలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచీ చెబుతున్నారు. ఒక పాత్ర సరసన ఈషారెబ్బా హీరోయిన్ గా నటిస్తోంటే.. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. సిటీలో ఉండే కుర్రాడికి సడెన్ గా సీమ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ మొదలవుతుందనే టాక్ మొదట్నుంచీ ఉంది. ఇక త్రివిక్రమ్ రీసెంట్ మూవీ అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ను మరింత కసిగా రూపొందిస్తున్నాడు. పైగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే త్రివిక్రమ్ ఇప్పటి వరకూ చూపించినదానికంటే ఇంకేదో కొత్తగా చూపించాలి. అందుకే అదిరిపోయే ప్లాట్ ఈ సినిమాలో ఉందనే టాక్ ఉంది. మొత్తగా దసరా సంబురాల్ని కాస్త ముందే తెస్తూ.. ఆ శెలవులను కూడా ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన త్రివిక్రమ్ ది మాస్టర్ ప్లానే కదా.. 

More Related Stories