English   

ర‌గులుతున్న అగ్నిప‌ర్వ‌తంలా త్రివిక్ర‌మ్... 

ntr-trivikram

త్రివిక్ర‌మ్.. ఒక్క ఫ్లాప్ తో నిశ్శ‌బ్ధం నామాత్రుక అన్న‌ట్టుగా మారిపోయాడు. త‌ర్వాత ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా విష‌యంలోకూడా అత‌న్నుంచి పెద్ద‌గా డైలాగ్స్ రావ‌డం లేదు. ఇంకా చెబితే ప్ర‌స్తుతం షూటింగ్ లో ఉన్న ఈమూవీకి సంబంధించి ఒక్క ఖ‌చ్చిత‌మైన వార్తా వినిపించ‌డం లేదు. ఇందుకు కార‌ణం త్రివిక్ర‌మ్ అంటున్నారు. అత‌ని కెరీర్ లో ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ అజ్నాత వాసి ఫ్లాప్ అత‌ని ఇమేజ్ ను విప‌రీతంగా డ్యామేజ్ చేసింది. అందుకే ఆ సినిమా అప‌జ‌యం మ‌రిచిపోయేలా ఓ భారీ హిట్ ఇవ్వాల‌న్న కసితో ఉన్నాడ‌ట త్రివిక్ర‌మ్. గట్టిగా చెబితే అత‌నిప్పుడు ర‌గులుతున్న అగ్నిప‌ర్వ‌తంలా ఉన్నాడంటున్నారు. సెట్స్ లోనూ ఇంత‌కు ముందులా జోవియల్ గా ఉండ‌టం లేద‌ట‌. పూర్తిగా సీరియ‌స్ మోడ్ లో ప‌నిచేస్తున్న‌ట్టుటాక్.  ఇక ఎన్టీఆర్ ను ఇప్ప‌టి వ‌ర‌కూచూపించ‌నంత కొత్త‌గా(త్రివిక్ర‌మా..? అనిక్వ‌శ్చ‌న్ మార్క్ వేయొద్దు) చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అసామాన్యుడు అనేవ‌ర్కింగ్ టైటిల్ వినిపిస్తోన్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. పూర్తిగా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో క‌థ  సాగుతుందంటున్నారు. లేటెస్ట్ గా క్రుష్ణార్జున యుద్ధంలో దారి చూడుదుమ్మూ చూడూమామా పాట‌తో ఫేమ్ అయిన పెంచ‌ల దాస్ ఈ సినిమాలోనూ ఓ పాట పాడ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే క‌న్ఫార్మ్ చేశారు. ఏదేమైనా ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఎప్పుడైనాబ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేఅగ్నిప‌ర్వ‌తంలా ఉన్నాడంటున్నారు. మ‌రి ఈ సినిమాతో అత‌నెలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడో చూడాలి. 

More Related Stories