English   

నితిన్ సినిమా కోసం త్రివిక్రమ్

nithin
2020-02-17 07:03:11

టాలీవుడ్ హీరో నితిన్‌ మంచి జోరుమీడున్నాడు. ఆ మధ్య సినిమాలే చేయకుండా చానాళ్ళు దైవ భక్తిలో గడిపేసిన ఆయన తర్వాత వరుస సినిమాలు ఒప్పుకున్నారు. ఇక ఆయన వెంకీ కుడుముల దర్శకుడిగా చేసిన చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో రేపు జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అంటున్నారు. మొన్న సంక్రాంతికి బన్నీతో అల వైకుంటపురములో హిట్ కొట్టిన ఆయన గతంలో నితిన్‌ హీరోగా త్రివిక్రమ్‌ ‘అఆ’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బంపర్ హిట్ అయింది. ఇక తమ హీరో ఈవెంట్ కి త్రివిక్రమ్ రానుండడంతో ఈ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

More Related Stories