English   

రామ్ చరణ్‌ కోసం కథను సిద్దం చేసిన త్రివిక్రమ్

Ram Charan trivikram
2020-07-06 18:13:17

మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ వర్కవుట్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా చేస్తున్న  త్రివిక్రమ్..లాక్ డౌన్ ఖాళీ టైమ్ లో రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్దం చేశాడట. రామ్ చరణ్ తో ఈ కథకి సంబంధించిన చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.  ఎన్టీఆర్ చిత్రం కథ పూర్తవడంతో ...ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఎన్టీఆర్ తో చేసే రెండో సినిమా కంప్లీట్ చేసిన వెంటనే రామ్ చరణ్ సినిమాని పట్టాలేక్కించబోతున్నాడట గురూజీ.మరోవైపు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్నాడట. చాలా రోజులుగా పవన్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలేక్కే అవకాశం ఉందంటున్నారు.

More Related Stories