English   

విక్రమ్ టెక్నీషియన్ తో త్రివిక్రమ్..?

Trivikram
2018-02-19 18:18:09

సినిమా సినిమాకూ టెక్నీషియన్స్ మార్చడంలో త్రివిక్రమ్ నిజంగానే మాంత్రికుడు. కావాలని చేస్తాడో లేక ఆ టైమ్ కు ఆప్షన్ లేక చేస్తాడో కానీ.. భలే మారుస్తాడు. అఫ్ కోర్స్ అది కూడా అతనికి బాగా కలిసొస్తుంది. ఒక్క అజ్ఞాతవాసి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తప్ప ఇలా చేసిన ప్రతిసారీ త్రివిక్రమ్ బానే గెయిన్ అయ్యాడు. అజ్ఞాతవాసి తర్వాత ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేసినట్టు చెబుతున్నారు. అనిరుధ్ ప్లేస్ లో తమన్ ను తీసుకున్నట్టు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కానీ ఎటొచ్చీ ఈ విషయాన్ని తమన్ కానీ త్రివిక్రమ్ కానీ లేదా ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని బ్యానర్ గానీ కన్ఫార్మ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ కు సంబంధించి మరో భారీ చేంజ్ ఫైనల్ అయింది.

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ టీమ్ లో ఓ స్ట్రాంగ్ మెంబర్ అతని సినిమాటోగ్రాఫర్.  పేరు పిఎస్ వినోద్. అతని పని ఓ రేంజ్ లో ఉంటుందని విక్రమ్ సినిమాలు చూస్తేనే తెలిసిపోతుంది. క్లాస్ సినిమాటోగ్రఫీ చూపించడంలో వినోద్ ఎక్స్ పర్ట్. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు వినోద్ ను తీసుకున్నారు. ఇది మాత్రం అఫీషియల్ గా కన్ఫార్మ్ అయినట్టే. అయితే అజ్ఞాతవాసికి సినిమాటోగ్రఫీ అందించి మణికందన్ కూడా టాప్ క్లాస్ వర్క్ చూపించాడు. అయినా అతన్నెందుకు మార్చాడన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఏదేమైనా మార్చి23న ఈ మూవీ అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది. ఈ లోగా ఎన్టీఆర్ తన బాడీ షేప్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఇందుకోసం ఓ ఇంటర్నేషనల్ ట్రెయినర్ కూడా తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకూ మనం ఎన్టీఆర్ ను చూడని షేప్ లో ప్రెజెంట్ చేయబోతున్నారట. అయితే విక్రమ్ టెక్నీషియన్ లా ఈ మార్పులు త్రివిక్రమ్ కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.

More Related Stories