English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్

Trivikram NTR
2020-08-04 10:29:07

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అంతా బాగుంటే ఈ పాటికి సెట్స్ మీదకి వెళ్లి ఉండేది. అయితే కరోనా దెబ్బకు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ? ఎప్పటికి పూర్తి అవుతుందో ? ఎప్పటికి రిలీజ్ అవుతుందో ? తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఒక వార్త నందమూరి అభిమానులని టెన్షన్ పెడుతోందని అంటున్నారు. అదేంటంటే అరవింద సమేత సినిమాకి చేసినట్టె ఈ సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్రయోగమే చేస్తున్నాడని అంటున్నారు. 

త్రివిక్రమ్ ఇప్పటి వరకు ట్రై చేయని జోనర్ లో ఈ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోది.  ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నారైగా ఆయన కనిపించబోతున్నాడని ఒకసారి రాజకీయ నాయకుడి కొడుకుగా కనిపించానున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories