English   

నాని టక్ జగదీశ్ టీజర్ టాక్

Tuck Jagadish
2021-02-23 18:20:52

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా "టక్ జగదీష్". ఈ సినిమాను నిన్ను కోరి సినిమాతో సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో నాని సరసన హీరోయిన్ లుగా పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ మరియు ఐష్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గరపాటి..హరీష్ పెద్ది షైన్ స్క్రీన్  బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను నాని పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కుటుంబ కథతో అల్లుకు పోయినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. దాంతో సినిమాలో నాని ఫైట్ లతో అదరకొట్టబోతునట్టు కనిపిస్తోంది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే నాని టక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.

More Related Stories