English   

ఉగాదికి టక్ జగదీష్ థియేట్రికల్ ట్రైలర్ 

Tuck Jagadish
2021-04-01 13:39:56

నాచురల్ స్టార్  నాని ప్రస్తుతం ఈయన నటిస్తున్న టక్ జగదీష్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. 

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 13న 'టక్ జగదీష్' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఇప్పటికే ఇప్పటికే విడుదలైన  టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో మరింత బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. 

ఇక సినిమాను ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అంధించాడు. రీతూ వర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

More Related Stories