English   

నాని.. ఆ మేనేజ‌ర్ ఎవ‌రు..?

Nani-Bigg-boss
2018-07-11 08:56:52

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు హీరో మాత్ర‌మే కాదు.. హోస్ట్ కూడా. బిగ్ బాస్ 2లో త‌న హోస్టింగ్ తో పిచ్చెక్కిస్తున్నాడు ఈ హీరో. మొద‌టి సారైనా కూడా ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా కుమ్మేస్తున్నాడు. ఈ హోస్టింగ్ లో ఎన్టీఆర్ ది ఓ స్టైల్ అయితే.. నాని మ‌రో స్టైల్. నాని టీవీ అంటూ ఇప్ప‌టికే త‌న ఓన్ మార్క్ సృష్టించుకున్నాడు ఈ హీరో. ఇక ప్ర‌తీ ఎపిసోడ్ లో ఓ పిట్ట‌క‌థ చెబుతూ ప్రేక్ష‌కుల్లోనూ షోపై ఆస‌క్తి పెంచేస్తున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన క‌థ‌ల్లో కంటే గ‌త‌వారం చెప్పిన క‌థ మాత్రం చాలా ఆస‌క్తికరంగా అనిపించింది. ఎందుకంటే అది క‌థ కాదు.. నాని క‌థ కాబ‌ట్టి. ఆయ‌న హీరో కాక‌ముందు రాధాగోపాలంకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న రోజుల్లో ఓ టీవీ చానెల్ కు ప్ర‌మోష‌న‌ల్ టేప్ ఇవ్వ‌డానికి వ‌చ్చాన‌ని.. పొద్దున ఏడున్న‌ర నుంచి రాత్రి ఏడున్న‌ర వ‌ర‌కు కూర్చుని వెయిట్ చేస్తూ ఆ మేనేజ‌ర్ త‌న‌కు క‌లిసే అవ‌కాశం ఇచ్చాడ‌ని చెప్పాడు నాని. మ‌ధ్య‌లో ఎన్ని సార్లు చూసినా కూడా కావాల‌నే వెయిట్ చేయించాడ‌ని గుర్తు చేసుకున్నాడు నాని. 

కొన్నేళ్ల త‌ర్వాత ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు టైమ్ లో ఆ ఛానెల్ కు వెళ్లిన‌పుడు అదే మేనేజ‌ర్ స‌ర్ దారి ఇటు స‌ర్ అంటూ చూపించాడ‌ని.. లైఫ్ ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా ఎక్క‌డ మారుస్తుందో చెప్ప‌డం క‌ష్టం అని గుర్తు చేసుకున్నాడు నాని. అందుకే లైఫ్ లో ఎవ‌ర్నీ త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌న్నాడు న్యాచుర‌ల్ స్టార్. అయితే ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి పుటిస్తున్న ప్ర‌శ్న ఏంటంటే ఆ మేనేజ‌ర్ ఎవ‌రు.. ఏ ఛానెల్ కు సంబంధించిన వాళ్లు అని. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఓ భారీ నెట్ వ‌ర్క్.. ఎంట‌ర్ టైన్మెంట్ ఛానెల్ అని తెలుస్తుంది. అందులోని మేనేజ‌ర్ నానిని అవ‌మానించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి ఆ మేనేజ‌ర్ కు ఇప్పుడు నాని ఏకంగా బిగ్ బాస్ 2 సాక్షిగా షాక్ ఇచ్చాడు. ఈ దెబ్బ‌తో లైఫ్ లో నానిని ఇంకెప్పుడూ మ‌రిచిపోడు ఆ స‌ద‌రు మేనేజ‌ర్. 

More Related Stories