English   

యుట‌ర్న్ ట్రైల‌ర్.. అదిరిపోయిందిగా..!

U-Turn-Trailer-talk
2018-08-17 15:42:11

కెరీర్ లో అన్ని సినిమాలు డ‌బ్బు కోస‌మే కాదు.. అప్పుడ‌ప్పుడూ ఆత్మ‌సంతృప్తి కోసం కూడా చేయాల‌ని అప్ప‌ట్లో మ‌హాన‌టి సావిత్రికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావ్ చెప్పారు. ఇప్పుడు ఇదే ఇంటికి కోడ‌లిగా వెళ్లిన స‌మంత కూడా తాత‌గారు చెప్పిన మాట‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తుంది. కెరీర్లో ఇప్ప‌టికే చాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసింది స‌మంత‌. ఇప్పుడు త‌నలోని నట‌న‌ను చూపించ‌డానికి వ‌స్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా అందాలు ఆర‌బోస్తూ న‌టించ‌డం ఎందుకు అని.. సింపుల్ గా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లను ఎంచుకుంటుంది. ఇప్పుడు ఈమె చేస్తోన్న యు ట‌ర్న్ సినిమా అలాంటిదే. 

క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి ఏడాది పాటు వేచి చూసింది స‌మంత‌. త‌న సినిమాలు వేగంగా పూర్తి చేసి ఈ చిత్ర రీమేక్ లో అడుగుపెట్టింది. వేరే హీరోయిన్ తో ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ చేయాల‌నుకున్నా కూడా అత‌న్ని ఆపి మ‌రీ ఈ స్క్రిప్ట్ చేస్తుంది స‌మంత‌. ఎందుకు ఈ సినిమాపై స‌మంత ఇంత‌గా మ‌న‌సు పారేసుకుందో ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అర్థ‌మైపోతుంది. ట్రైల‌ర్ అంతా స‌స్పెన్స్ తో నిండిపోయింది. పైగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా సాగే క‌థ కావ‌డంతో స‌మంత అంత‌గా మ‌న‌సుకు న‌చ్చింద‌ని చెప్పింది. ఆది ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ తిరిగే క‌థ ఇది. రోడ్ సైడ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో స‌మంత పాత్ర కొత్త‌గా ఉండ‌బోతుంది. ఫ‌స్ట్ లుక్ లో కూడా స‌మంత సీరియస్ గా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది ఈ చిత్రం. చూడాలిక‌.. యు ట‌ర్న్ తో స‌మంత కెరీర్ ఎలాంటి యు ట‌ర్న్ తీసుకుంటుందో..?

More Related Stories