English   

 కాబోయే అల్లుడు ఉద‌య్ కిర‌ణ్.. 

Uday- Kiran-Biopic

అవును.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది. మ‌హాన‌టి రాక‌తో తెలుగులో బ‌యోపిక్ ల గోల ఎక్కువైపోయింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించ‌డానికి బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ బ‌యోపిక్ నుంచి ఉన్న‌ట్లుండి తేజ త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు ఇది ఎప్పుడొస్తుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయింది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు తేజ మ‌రో బ‌యోపిక్ కు తెర‌తీస్తున్నాడు. అదే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్. 2014లో ఈయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అంతా ఈ కుర్ర హీరోను మ‌రిచిపోయారు. కానీ ఇప్పుడు తేజ గుర్తు చేస్తున్నాడు. ఉద‌య్ ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది తేజ‌నే. చిత్రం.. నువ్వునేను సినిమాల‌తో ఆయ‌నకు స్టార్ డ‌మ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత కూడా ఔన‌న్నా కాద‌న్న సినిమా చేసాడు కానీ అది డిజాస్ట‌ర్. అయితే ఉద‌య్ జీవితంలో అనుకోని కుదుపు చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం అయి క్యాన్సిల్ అవ్వ‌డం. ఆ త‌ర్వాతే ఆయ‌న కెరీర్ గాడి త‌ప్పిందంటారు అంతా. ఓ ర‌కంగా ఉద‌య్ కెరీర్ నాశ‌నం కావ‌డానికి సొంత త‌ప్పిదాలు ఎన్ని ఉన్నాయో.. చిరు కూడా అంతే కార‌ణం అంటారు. ఆ క‌థంతా ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ లో చూపిస్తానంటున్నాడు తేజ‌. దీనికి కాబోయే అల్లుడు అనే టెంప్టింగ్ టైటిల్ పెట్టాడు తేజ‌. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఇప్పుడు ఈ బ‌యోపిక్ మొద‌లు పెడుతున్నాడు అంటూ తేజ‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బ‌యోపిక్ చేయాల్సినంత గొప్పసంఘ‌ట‌న‌లు ఉద‌య్ జీవితంలో ఏం జ‌ర‌గ‌లేదు. కానీ చేస్తానంటున్నాడంటే కేవ‌లం కాంట్ర‌వ‌ర్సీ కోస‌మే క‌దా..! మ‌రి ఉద‌య్ జీవితాన్ని తెర‌పై చూపించాలంటే మ‌ధ్య‌లో చిరుతో పాటు ప‌వ‌న్, అల్లు అర‌వింద్ పాత్ర‌లు కూడా చూపించాలి. మ‌రి అవ‌న్నీ చూపిస్తాడో లేదో చూడాలిక‌..!
 

More Related Stories